ASBL NSL Infratech

ట్రూ ఎడ్జ్ నైఫ్ సింగిల్స్ మరియు ఏస్ హ్యాండ్ బ్లెండర్‌ను ఆవిష్కరించిన ప్రెస్టీజ్

ట్రూ ఎడ్జ్ నైఫ్ సింగిల్స్ మరియు ఏస్ హ్యాండ్ బ్లెండర్‌ను ఆవిష్కరించిన ప్రెస్టీజ్

కచ్చితత్వం మరియు చక్కదనంతో వంటల నైపుణ్యాన్ని పెంచండి

భారతదేశంలో కిచెన్ సొల్యూషన్స్‌ లో అగ్రగామిగా ఉన్న టీటీకే ప్రెస్టీజ్ ఇటీవల రెండు అత్యాధునిక ఉపకరణాలు  -ట్రూ ఎడ్జ్ నైఫ్ సింగిల్స్ మరియు ఏస్ హ్యాండ్ బ్లెండర్-ను ఆవిష్కరించిం ది. ఇవి వివిధ గృహ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి.

ప్రెస్టీజ్ ట్రూ ఎడ్జ్ నైవ్‌లు సింగిల్-పీస్ స్టెయిన్‌లెస్ స్టీల్, దృఢమైన పట్టును అందించే హ్యాండిల్స్‌ తో  రూపొం దించబడ్డాయి. ఇవి మన్నిక మరియు సురక్షితమైన పట్టును నిర్ధారిస్తాయి. ప్రొటెక్టివ్ సర్ఫేస్ ఫినిష్ తో తయారు చేయబడిన ఈ కత్తులు తుప్పును నిరోధిస్తాయి, పదునుగా ఉంటాయి, మెరుస్తుం టాయి. చక్కటి పదును, టెంపర్డ్ స్టీల్ అనేవి కటింగ్ ఎడ్జ్‌ కి దోహదపడతాయి, తక్కువ మణికట్టు స్ట్రెయిన్‌ తో తిరుగులేని పాక అనుభవాలను అందిస్తాయి.

ట్రూ ఎడ్జ్ నైఫ్ సింగిల్స్ శ్రేణి 5 విభిన్న రకాల కత్తులను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా చెక్కు తీయడం, ముక్కలుగా కోయడంలో ఉత్తమంగా ఉంటాయి. పరింగ్ నైఫ్ అనేది రకరకాల వినియోగాలను అందిస్తుంది. ఇది పండ్లు, కూరగాయల ట్రిమ్ చేయడానికి, చెక్కు తీయడానికి, విత్తనాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. వెజిటబుల్ నైఫ్ కూడా అంతే అవసరం, ఇది ఆల్ ఇన్ వన్ కట్టింగ్ సొల్యూ షన్‌గా ఉపయోగపడుతుంది. వివిధ కూరగాయలను కత్తరించడం మొదలుకొని చెక్కు తీయడం, డైస్ చే యడం, ముక్కలు చేయడం దాకా ఈ కత్తి మీ వంటగది దినచర్యకు సామర్థ్యాన్ని జోడిస్తుంది. వీటికి తోడు గా వెజిటబుల్ పీలర్ కూడా ఉంది. పండ్లు, కూరగాయలకు సులభంగా చెక్కు తీసేందుకు ఇది రూపొందించబడింది.

రకరకాల వినియోగాల కోసం రంపపు అంచులతో కుక్ నైఫ్‌ను ఎంచుకోవచ్చు. మాంసం, కూరగాయలను కత్తిరించడానికి ఒక అద్భుతమైన ఎంపిక. రంపపు అంచు మెరుగైన పట్టును అందిస్తుంది.  మందపాటి ఉపరితలాలను సులభంగా ఎదుర్కొంటుంది. చివరగా, యుటిలిటీ నైఫ్, బహుముఖ స్లైసింగ్ సామర్థ్యాలతో నిలుస్తుంది, ఇది పండ్లు, కూరగాయలు, లేత మాంసాన్ని సరైన ముక్క లుగా చేస్తుంది.

ఏస్ హ్యాండ్ బ్లెండర్ అనేది మీ వంట అనుభవాన్ని మార్చే శక్తివంతమైన వంటగది సాధనం. ఈ సొగసైన ఉపకరణం చట్నీ, ప్యూరీ, స్మూతీస్ మరియు మరెన్నో వాటిని నిర్వహించడంతోపాటు అత్యుత్తమ ఫలితాలను అందించడం కోసం 250-వాట్ల శక్తివంతమైన మోటారును కచ్చితమైన-ఇంజనీరింగ్ స్టెయిన్‌లెస్-స్టీల్ బ్లేడ్‌లను మిళితం చేస్తుంది.

 

రోజువారీ ఉపయోగం కోసం వినియోగదారు సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్పాదన రూపొందించబ డింది. ఇది ఎర్గోనామిక్‌గా రూపొందించబడిన బాడీని కలిగి ఉంటుంది, కనిష్ట ఒత్తిడితో మృదువైన బ్లెండింగ్ అనుభవాన్ని నిర్ధారిస్తుంది. ఇది వంటలు చేసే వాళ్లు, నిపుణుల వద్ద తప్పనిసరిగా ఉండాలి.

సొగసైన, స్లిమ్ బాడీ డిజైన్‌తో, ఏస్ హ్యాండ్ బ్లెండర్ ఒక సాధారణ వంటగది సాధనం కంటే ఎక్కువ; ఇది మీ వంటగదికి ఆధునిక చక్కదనాన్ని జోడిస్తుంది. దీని స్లిమ్ ప్రొఫైల్ చిన్న వంటిళ్లకు అనువైనది. ఈ స్టైల్,  ఫంక్షనాలిటీ కలయిక సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది, అంతేగాకుండా సులభంగా నిర్వహించేందుకు వీలు కల్పిస్తుంది. వినియోగదారులకు సౌలభ్యం కోసం అందిస్తుంది.

బహుళ ప్రయోజన అత్యాధునిక కత్తుల (చాకులు) యొక్క ఈ శ్రేణి మీ అవసరాలను సంపూర్ణంగా తీరు స్తుంది. వీటి ధరలు రూ. 75 నుంచి రూ. 145. పారింగ్ నైఫ్, వెజిటబుల్ నైఫ్ మరియు కుక్ నైఫ్ ధర రూ. 145, యుటిలిటీ నైఫ్ ధర రూ. 125, మరియు వెజిటబుల్ పీలర్ ధర రూ. 75.

ఏస్ హ్యాండ్ బ్లెండర్ ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది. ఈ ఉత్పత్తి యొక్క గరిష్ట చిల్లర ధర రూ. 1,295/- కానీ తగ్గింపు ధర రూ. 970/-. ట్రూ ఎడ్జ్ నైఫ్ సింగిల్స్ & ఏస్ హ్యాండ్ బ్లెండర్‌తో మీ వంటల ప్రయాణాన్ని శక్తివంతం చేసుకోండి - ఇక్కడ శక్తి కచ్చితత్వం, శైలి ఆచరణాత్మకతను కలుస్తుంది.

టీటీకే ప్రెస్టీజ్ గురించి  (https://shop.ttkprestige.com/ )

టీటీకే ప్రెస్టీజ్ లిమిటెడ్ అనేది   గ్రూప్‌లో భాగం. గత ఆరు దశాబ్దాలుగా టీటీకే ప్రెస్టీజ్ లిమిటెడ్ దేశంలోని గృహిణుల అవసరాలను తీర్చడంలో భారతదేశపు అతిపెద్ద కిచెన్ ఉపకరణాల కంపెనీగా అవతరించింది. ప్రతి ప్రెస్టీజ్ బ్రాండ్ ఉత్పత్తి భద్రత, ఆవిష్కరణ, మన్నిక మరియు విశ్వాసం అనే స్తంభాలపై నిర్మించబడింది, మిలియన్ల కొద్దీ ఇళ్లలో ఈ బ్రాండ్‌ను మొదటి ఎంపికగా చేస్తుంది. 2016 ఏప్రిల్ లో  టీటీకే ప్రెస్టీజ్ వినూత్నమైన ఇంటిని శుభ్రపరిచే పరిష్కారాల శ్రేణి  'ప్రెస్టీజ్ క్లీన్ హోమ్'ని ప్రారంభించింది. కంపెనీ అదే నెలలో యూకేకు చెందిన హార్‌వుడ్ హోమ్‌వేర్స్ ను కొనుగోలు చేసింది మరియు ఆగస్టు 2017లో భారతదేశంలో జడ్జ్ బ్రాండ్‌ను ఆవిష్కరించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :