ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ 'హను-మాన్‌' షూటింగ్ పూర్తి

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ 'హను-మాన్‌' షూటింగ్ పూర్తి

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్నతొలి చిత్రం 'హను-మాన్‌'. ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా   టించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.  ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. షూటింగ్ చివరి రోజు అద్భుతమైన లొకేషన్‌ని చూపించే వీడియోని మేకర్స్ షేర్ చేశారు.

ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి 130 వర్కింగ్ డేస్ పట్టింది. హను-మాన్ భారతదేశం అంతటా చిత్రీకరించబడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ తన చిత్రాలన్నింటి కంటే బెస్ట్ క్యాలిటీతో  పాటు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం కోసం ఈ సినిమాపై ఎక్కువ సమయం కేటాయించారు.

ఈ సినిమా టీజర్‌కి యూట్యూబ్‌లో అన్ని భాషల్లో అద్భుతమైన స్పందన వచ్చింది. హనుమాన్ జయంతి నాడు విడుదలైన హనుమాన్ చాలీసా కూడా అన్ని మూలల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి టీమ్ అహర్నిశలు కష్టపడుతోంది .

హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్‌తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్ విడుద కానుంది. నిర్మాతలు త్వరలోనే ఖచ్చితమైన విడుదల తేదీని అనౌన్స్ చేశారు.

హను-మాన్ "అంజనాద్రి" అనే ఊహాత్మక ప్రదేశంలో సెటప్ చేయబడింది. కథానాయకుడు హనుమంతుని శక్తులను పొంది అంజనాద్రి కోసం ఎలా పోరాడాడనేది చిత్ర కథాంశంగా తెలుస్తోంది. సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

ఈ అద్భుతమైన చిత్రానికి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందించగా.. గౌరహరి, అనుదీప్ దేవ్,  కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :