ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య కేంద్రం ప్రారంభం

ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య కేంద్రం ప్రారంభం

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. యాపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌తో కలిసి స్వరవేద మహామందిర్‌కు ప్రారంభోత్సవం చేశారు. ఈ కేంద్రంలో ఒకేసారి 20 వేల మంది ధ్యానం చేసుకొనే సౌకర్యం ఉన్నది. వారణాసి నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ధ్యానకేంద్రాన్ని నిర్మించారు. ఆలయ ప్రారంభోత్సవం అనంతరం ఓ ర్యాలీలో పాల్గొని మోదీ  ప్రసంగిస్తూ స్వరవేద ఆలయం గురించి ప్రస్తావించారు. అంతకుమందు ప్రధా ఆలయంలో వివాంగం యోగా శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు. 19వ శతాబ్దానికి చెందని ఆధ్యాత్మిక, యోగా గురువు, పద్యకారుడు సద్గురు దేవ్‌జీ మహరాజ్‌కు గుర్తుగా విహంగం యోగ్‌ సంస్థాన్‌ ఈ కేంద్రాన్ని నిర్మించింది. కాగా 2021లో ప్రధాని ఒకసారి ఈ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రంలోని మహామందిరంలో సద్గురువు విగ్రహం ప్రతిష్టించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :