ASBL NSL Infratech

‘కచ్చతీవు’ గురించి సరే.. చైనా ఆక్రమణలపై మాట్లాడరే: ప్రధానిపై శరద్ పవార్ ఫైర్

‘కచ్చతీవు’ గురించి సరే.. చైనా ఆక్రమణలపై మాట్లాడరే: ప్రధానిపై శరద్ పవార్ ఫైర్

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కచ్చతీవు దీవి అంశంపై కాంగ్రెస్, డీఎంకేలపై ప్రధాని మోదీతో పాటు ఇతర బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్సీపీ (శరద్ పవార్) నేత శరద్ పవార్.. బీజేపీ ప్రభుత్వంపై కౌంటర్ ఎటాక్‌కి దిగారు. కచ్చతీవు దీవి గురించి మాట్లాడే ముందు భారత భూభాగాలను చైనా ఆక్రమించుకోవడంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు.

పార్టీ కార్యాలయంలో గురువారం నాడు మీడియా సమావేశం నిర్వహించిన శరద్ పవార్.. ‘‘1974లో ఇందిరాగాంధీ హయాంలో శ్రీలంకకు అప్పగించిన కచ్చతీవు దీవి గురించి రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ మాట్లాడారు. కచ్చతీవు దీవిని కాంగ్రెస్ పార్టీ శ్రీలంకకు ఇవ్వడం తప్పు అంటూ తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. అయితే భారతదేశ భూభాగాలను చైనా ఆక్రమించుకోవడంపై ఎందుకు స్పందించడం లేదు? దీనిపై పార్లమెంట్‌లో కూడా చర్చ జరిగింది. మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో మోదీ ఎందుకు చెప్పరు?’’ అంటూ ప్రధాని మోదీపై శరద్ పవార్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే తమిళనాడుకు, శ్రీలంకకు మధ్య ఉండే ఓ చిన్న ద్వీపం కచ్చతీవు. ఇది 1974కు ముందు భారత్‌లో భాగంగా ఉండేది. అయితే 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇండో-శ్రీలంకన్ మేరీటైం అగ్రిమెంట్’’ ప్రకారం ఈ దీవిని శ్రీలంకకు అప్పగించింది. అప్పటి నుంచి ఈ దీవి శ్రీలంక ఆధీనంలోనే ఉంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :