గాంధీకి ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము నివాళులు

భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. గాంధీతోపాటు మాజీ ప్రదానమంత్రి లాల్ బహదూరు శాస్త్రికి కూడా వారు నివాళులు అర్పించారు. రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి రాష్ట్రపతి, ప్రధాని పుష్పాంజలి ఘటించారు. గాంధీజీ అంత్యక్రియలు జరిగిన చోటులో ఏర్పాటు చేసిన జ్యోతికి నమస్కరించారు. గాంధీజీ 153వ జయంత్యుత్సవాలు, శాస్త్రీజీ 118వ జయంతి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారికి ముర్ము, మోదీలతోపాటు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు, తదితరులు నివాళులర్పించారు.
https://twitter.com/







Tags :