ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మామా అల్లుళ్ల సినిమాకు త‌ప్ప‌ని లీకుల బెడ‌ద‌

మామా అల్లుళ్ల సినిమాకు త‌ప్ప‌ని లీకుల బెడ‌ద‌

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబోలో స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న వినోదాయ సీతం రీమేక్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా చిన్న బ్రేక్ తీసుకున్న ప‌వ‌న్, ఇప్పుడు అది పూర్త‌వ‌డంతో త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్‌లో జాయిన్ కాబోతున్నాడు. 

ఇప్ప‌టిదాకా జ‌రిగిన షూటింగ్‌లో ఇప్ప‌టికే 30% టాకీ పార్ట్ పూర్త‌యింద‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ మొన్న త‌న‌కు రోజుకు రెండు కోట్లు ఇస్తున్నార‌ని, ఒక సినిమాకు 40 కోట్ల‌కు పైగా కేవ‌లం ఇర‌వై రోజుల్లో సంపాదిస్తున్నాన‌ని ప‌వ‌న్ చెప్పింది ఈ సినిమా గురించే. ఇదంతా బాగానే ఉంది కానీ తాజాగా దీనికి లీకుల బెడ‌ద టెన్ష‌న్ పెడుతుంది. 

మామా అల్లుళ్లు క‌లిసి న‌టిస్తున్న మొద‌టి సినిమా కావ‌డంతో ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ నుంచి ట్రైలర్, సినిమా వ‌ర‌కు ప్ర‌తీదీ స్పెష‌ల్ గా ఉండాల‌నుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ షూటింగ్ నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు ఫోటోలు లీకులు అవుతూనే ఉన్నాయి. ఈ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. లీకైన ఫోటోల్లో ప‌వ‌న్ చాలా స్టైలిష్ గా క‌నిపిస్తున్నాడు. 

ఈ లీకైన ఫోటోలు ఫ్యాన్స్ కు ఎనర్జీ ఇస్తున్న‌ప్ప‌టికీ ఈ లీకులు ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చాయో తెలుసుకునే ప‌నిలో నిర్మాత‌లున్న‌ప్ప‌టికీ, ఎవ‌రు అనేది తెలియ‌డం లేదు. త్రివిక్ర‌మ్ రైటింగ్‌లో వ‌స్తున్న ఈ ఫాంట‌సీ డ్రామాలో ప‌వ‌న్ మ‌నిషి రూపంలో వ‌చ్చే విధి క్యారెక్ట‌ర్‌ను పోషిస్తుండ‌గా, ఫ్యామిలీ ప్రాబ్ల‌మ్స్‌తో స‌త‌మ‌త‌మ‌య్యే చిన్న ఉద్యోగి క్యారెక్ట‌ర్‌లో సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌నిపించ‌నున్నాడు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :