ASBL NSL Infratech

ప‌వ‌న్-శ్రీలీల మాస్ సాంగ్ కన్ ఫర్మ్

ప‌వ‌న్-శ్రీలీల మాస్ సాంగ్ కన్ ఫర్మ్

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అంటే శ్రీలీల పేరే చెప్పుకోవాలి. ప‌దికి పైగా సినిమాల‌తో బిజీగా ఉన్న హీరోయిన్ ప్ర‌స్తుతం శ్రీలీల ఒక్క‌టే. మొద‌టి సినిమా పెళ్లి సంద‌డిని కేవ‌లం త‌న గ్లామ‌ర్ తో నెక్ట్స్ స్థాయికి తీసుకెళ్లి, దాన్ని ఆడించిందనే విష‌యాన్ని బ‌య్య‌ర్లే చెప్తున్నారు. రీసెంట్‌గా ధ‌మాకాలో ఈ అమ్మ‌డు చేసిన అల్ల‌రి అంతా ఇంతా కాదు.

ధ‌మాకా హిట్ అవ‌డంలో శ్రీలీల పాత్ర చాలానే ఉంది. ఈ సినిమాలో అమ్మ‌డు చేసిన డ్యాన్స్‌లు, ర‌వితేజ‌తో క‌లిసి చేసిన అల్ల‌రి, త‌న గ్లామ‌ర్ ధ‌మాకాకు పెద్ద ప్ల‌స్ అయ్యాయి. జింతాక, ప‌ల్స‌ర్ బైకు సాంగ్‌కు రిపీట్ వ్యూస్ ఉండ‌టానికి కార‌ణం శ్రీలీలే అని చెప్పొచ్చు. అలాంటి శ్రీలీల ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమా చేస్తుంది. ఇటీవ‌లే రెగ్యుల‌ర్ షూటింగ్‌లో కూడా అమ్మ‌డు జాయిన్ అయింది. 

రీసెంట్‌గా ఓ ఫ్యాన్, డైరెక్ట‌ర్ హరీష్ శంక‌ర్‌ను ఉద్దేశించి ఎలాగైనా స‌రే ప‌వ‌న్ కు, శ్రీలీల కు మంచి మాస్ సాంగ్ పెట్ట‌మ‌ని అడిగాడు. దానికి ఓకే అన్న‌ట్లుగా హ‌రీష్ ఇచ్చిన రిప్లై ఫ్యాన్స్‌కు ఉత్సాహాన్ని క‌లిగిస్తోంది. మామూలుగానే సాంగ్స్‌తో ర‌చ్చ చేయ‌డం హ‌రీష్ కు మొద‌టి నుంచి అల‌వాటు. మిర‌ప‌కాయ్, గ‌బ్బ‌ర్‌సింగ్ ఆల్బ‌మ్స్‌కు డ్యాన్స్ విష‌యంలో హ‌రీష్ బాగా కేర్ తీసుకున్నాడు. 

ఇప్పుడు ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌కు కూడా హ‌రీష్ త‌న పాత ఫార్ములాను ఫాలో కానున్నాడు. త‌మిళ తేరి మూవీకి ఎన్నో మార్పులు చేసి ఎంతో అద్భుతంగా ఈ క‌థ‌ను రెడీ చేసిన‌ట్లు ఇప్ప‌టికే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప‌వ‌న్ కు ఇంత‌కుముందుకు ఇచ్చిన దానిని మించి మంచి ఆల్బ‌మ్ ఇవ్వాల‌నే ఆలోచ‌న‌తో దేవీ శ్రీ ఉన్నాడ‌ట‌. ప‌వ‌న్- శ్రీలీల కాంబో అంటే ఫ్యాన్స్ కు ఉండే అంచ‌నాలు హ‌రీష్ కు తెలుసు కాబ‌ట్టి, దేవీ నుంచి అద్దిరిపోయే పాట‌ను రాబ‌ట్టుకుంటాడ‌నే అనుకుందాం.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :