ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

యూపీఏ-3 దిశగా...

యూపీఏ-3 దిశగా...

బీజేపీ హఠావో.. దేశ్ బచావో నినాదంతో దేశవ్యాప్తంగా విపక్షాలు ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా బిహార్ సీఎం నితిష్ కుమార్ అయితే కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. హస్తిన పీఠం నుంచి బీజేపీని దించేవరకూ విశ్రమించేది లేదని తేల్చి చెబుతున్నారు. రాష్ట్రాల సీఎంలను కలిసి ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కన్నడ ఫలితాలతో విపక్షాలకు ఓ తాడు దొరికినట్లైంది. బీజేపీని ఓడించే ఫార్ములా ఇదేనని విపక్షనేతలు సైతం గట్టిగా నమ్ముతున్నారు.

కలిసినడిస్తే బీజేపీని ఓడించగలమన్న ఫార్ములాను అమలు చేసేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎక్కడ ఏపార్టీకి బలముంటే ఆపార్టీ అభ్యర్థికి మిగిలినపార్టీలు మద్దతివ్వాలన్నది వ్యూహంగా ముందుకు సాగుతున్నాయి. మరోవైపు బీజేపీని ఎలాగైనా ఓడించాలని కసిగా ఉన్న ఎస్పీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్.. 80 సీట్లు గెలుద్దాం.. బీజేపీని మట్టికరిపిద్దామని శ్రేణులకు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఎందుకంటే యూపీ అత్యధికంగా ఎంపీసీట్లు  ఉన్న రాష్ట్రం.. అక్కడ బీజేపీని దెబ్బకొడితే.. హస్తిన పీఠం అందదని అఖిలేష్ భావన..

మరోవైపు.. ఈసారి యూపీఏ-3 ఏర్పాటుకు అవకాశాలున్నాయంటున్నారు కాంగ్రెస్ మాజీ నేత కపిల్ సిబల్. అయితే, విపక్ష పార్టీలు ఉమ్మడి ఎజెండాను నిర్ణయించుకుని, లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించేందుకు సిద్ధం కావాల్సి ఉంటుందని అన్నారు. యూపీఏ-3 ఏర్పాటు చేసే అవకాశాలపై స్పందిస్తూ, కనీస ఉమ్మడి కార్యక్రమానికి బదులుగా పార్టీలన్నీ ''న్యూ విజన్ ఫర్ ఇండియా'' పై తప్పనిసరిగా దృష్టి సారించాల్సి ఉంటుందని అన్నారు.

ఈనెల 23న విపక్ష పార్టీల సమావేశానికి బీహార్ సీఎం నితిష్ కుమార్ పిలుపునిచ్చిన నేపథ్యంలో సిబల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తదితరులు పాల్గోనున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :