ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

జూనియర్ ఎన్టీఆర్ NTR#30 ఈ మార్చి నెలలో అయినా మొదలవుతుందా?

జూనియర్ ఎన్టీఆర్ NTR#30 ఈ మార్చి నెలలో అయినా మొదలవుతుందా?

ఎన్టీఆర్ అభిమానులు దాదాపు ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న NTR#30 ఎప్పటికప్పుడు  అనేక కారణాల వల్ల  వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మూవీ ఓపెనింగ్ గురించిన లేటెస్ట్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించనున్న ఏ సినిమా కూడా సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. కొన్ని రోజుల క్రితం యూఎస్‌లో RRR ప్రమోషన్స్‌లో పాల్గొ్న్న తారక్.. అక్కడి నుంచి వచ్చిన తర్వాతైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారనుకుంటే అదీ జరగలేదు. దీంతో జూనియర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో పట్టాలెక్కనున్న NTR#30 మూవీ అప్‌డేట్స్ కోసం సోషల్ మీడియాలో అభిమానులు రెచ్చిపోయారు. దీంతో ‘అమిగోస్’ ఆడియో ఫంక్షన్‌లో అభిమానుల తీరుపై తారక్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఇదే సందర్భంగా మూవీ లాంచ్ టెటివ్ డేట్‌ను వెల్లడించగా.. ఆ తర్వాత అఫిషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. కానీ ఇంతలోనే నందమూరి కుటుంబంలో విషాదం నెలకొనడంతో వాయిదాపడింది. కాగా.. ఇప్పుడు మరోసారి NTR#30 లాంచింగ్ డేట్  గురించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తెలుస్తు్న్న సమాచారం ప్రకారం.. NTR#30 మార్చి18న  శనివారం రోజున అధికారికంగా ప్రారంభం కానుంది. దీనిపై మేకర్స్ చర్చిస్తుండగా.. త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. అంతేకాదు ఈ సినిమా లో  జూనియర్ సరసన బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు కన్‌ఫర్మ్ అయినప్పటికీ అఫిషియల్‌గా ఇంకా  ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే మార్చి ఫస్ట్ వీక్‌లో హీరోయిన్‌ గురించిన ప్రకటన కూడా ఉండనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా మొదలుపెట్టాలన్న సందిగ్ధంలో జూనియర్ ఉన్నాడని కూడా రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక తారకరత్న మరణం నందమూరి ఫ్యామిలీని విషాదంలో నింపగా.. ఎన్టీఆర్ ఈ కారణంగానే HCA అవార్డ్స్ వేడుకలకు కూడా హాజరుకాలేక పోయారు. ఈ వేడుకల్లో RRR చిత్రం ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డులు సాధించి మరోసారి అంతర్జాతీయ వేదికపై ఇండియన్ సినిమా సత్తా చాటింది. తన కోస్టార్ రాంచరణ్.. స్పాట్ లైట్ అవార్డ్ అందుకున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :