ASBL NSL Infratech

మా లక్ష్యం నెరవేరే వరకు వెనకడుగు వేయబోం

మా లక్ష్యం నెరవేరే వరకు వెనకడుగు వేయబోం

రష్యాతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. యుద్ధం కోసం 5 లక్షల మంది ఉక్రెయిన్‌ పౌరులను సైన్యంలోకి తీసుకోవాలన్న ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిపారు. దీనికి ప్రజా మద్దతు ఉండదని సైన్యంతో చెప్పినట్లు వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యాతో యుద్ధం వచ్చే ఏడాది ముగుస్తుందా? అన్న ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేరు. ఉక్రెయిన్‌ ప్రజలు, సైనిక కమాండర్లు, మాకు మద్దతు తెలుపుతున్న పశ్చిమ దేశాల మిత్రులకు కూడా తెలియదు. అయితే యుద్ధంలో మా లక్ష్యం నెరవేరే వరకు వెనకడుగు వేయబోం అని స్పష్టం చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :