ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బిడెన్ కు ఎదురుగాలి...?

బిడెన్ కు ఎదురుగాలి...?

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి కొనసాగుతోంది. రిపబ్లికన్ల తరపున అధ్యక్ష రేసులో మాజీ అధ్యక్షుడు ట్రంప్, వివేక్ రామస్వామి, నిక్కీహేలీ, డిసాంటిస్,టిమ్ స్కాట్ పోటీ పడుతున్నారు. అయితే తాజా పోల్ లో బిడెన్ కు ఎదురుగాలి వీస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో బిడెన్ అనారోగ్యసమస్యలు అధికంగా ఎదుర్కోవడం, వయసు మీద పడడంపై.. అమెరికన్లు ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని అమెరికాఅధ్యక్షుడు బిడెన్ కూడా అంగీకరించారు.

నిక్కీహేలీకీ అమెరికన్ల మద్దతు ..

ఈ వారం విడుదలైన హార్వర్డ్ క్యాప్స్-హారిస్ పోల్ పోల్‌లో అమెరికా అధ్యక్షుడు GOP అభ్యర్థులైన డొనాల్డ్ ట్రంప్, హేలీ మరియు టిమ్ స్కాట్‌ల కంటే వెనుకంజలో ఉన్నారు. అయితే  భారతీయ-అమెరికన్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి మరియు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌ల కంటే కాస్త ముందంజలో ఉన్నట్లు తేల్చింది సర్వే.

ట్రంప్ తర్వాత నిక్కీకే ...

రిపబ్లికన్ల తరపున ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతుండడంతో.. ఈసర్వేలో ఇలాంటి పరిణామం చోటు చేసుకుందని హార్వర్డ్ హారిస్ పోల్ సహ డైరెక్టర్ మార్క్ పెన్  వ్యాఖ్యానించారు. ఈసర్వేను పరిశీలిస్తే జో బిడెన్ ప్రత్యర్థుల కన్నా వెనకంజలో ఉన్నారని స్పష్టమవుతుందన్నారు.ది హిల్‌ పోల్‌లో 44 శాతం మంది ట్రంప్‌కు ఓటు వేస్తామనగా.. 40 శాతం మంది బిడెన్‌కు మద్దతు ఇస్తామని చెప్పారు.జులైలో జరిగిన హార్వర్డ్ క్యాప్స్-హారిస్ పోల్‌లో ట్రంప్‌కు 45 శాతం మరియు బిడెన్‌కు 40 శాతం ఉన్న పోల్‌లో పెద్దగా మార్పు లేకుండా ఉంది.  మరో 15శాతం మంది వేరే సమాధానాలిచ్చారని ద హిల్ తెలిపింది.

2024లో హేలీ మరియు బిడెన్ మధ్య ఊహాజనిత ఫైట్ గురించి అడిగినప్పుడు, ప్రస్తుత అధ్యక్షుడికి మద్దతు ఇస్తానని చెప్పిన 37 శాతం మందితో పోల్చితే, 41 శాతం మంది ప్రతివాదులు హేలీకి  మద్దతుగా నిలిచారు.21 శాతం మంది కచ్చితమైన సమాధానాలివ్వలేదు.

బిడెన్ తర్వాతే స్కాట్, రామస్వామి..

బిడెన్ మరియు స్కాట్‌ల మధ్య మ్యాచ్ గురించి అడిగినప్పుడు,  బిడెన్ వైపే పోల్ పర్సెంటేజ్ మొగ్గుచూపింది. ఇక...రేసులో ఉన్న వివేక్ రామస్వామి కంటే బిడెన్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు, వివేక్ రామస్వామికి 37 శాతం మంది మద్దతివ్వగా.., బిడెన్ 39 శాతం అందుకున్నాడు. అంతే కాదు మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్, డిసాంటిస్ లపైనా ఆధిక్యం కనబర్చారు బిడెన్.

ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నందున తాను రాజకీయంగా ముందుకెళ్తున్నట్లు బిడెన్ స్పష్టం చేశారు. 2024లో ప్రజాస్వామ్యం మరోసారి బ్యాలెట్‌లో ఉంది. డోనాల్డ్ ట్రంప్, ఇతర రిపబ్లికన్లు అమెరికన్ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నారు. వారికా అవకాశం ఇవ్వకూడదన్నదే తన థ్యేయమన్నారు బిడెన్.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :