ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

లోక్ సభ ఎన్నికల బరిలో బాలీవుడ్ నటి?

లోక్ సభ ఎన్నికల బరిలో బాలీవుడ్ నటి?

 ప్రముఖ బాలీవుడ్‌ నటి, మోడల్‌ నేహాశర్మ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బిహార్‌ నుంచి ఆమెను బరిలోకి దింపాలని నేహా తండ్రి, కాంగ్రెస్‌ నేత అజిత్‌ శర్మ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  బిహార్‌లోని భగల్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉంది. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానం కాంగ్రెస్‌కే దక్కాలి. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ సీటు మా పార్టీకి వస్తే, నేను పోటీ చేయడం లేదా నా కుమార్తె నేహాశర్మను బరిలోకి దించాలని భావిస్తున్నా. దీనిపై పార్టీని సంప్రదిస్తూ. తుది నిర్ణయం హైకమాండ్‌దే అని భగల్‌పుర్‌ ఎమ్మెల్యే అజిత్‌ శర్మ వెల్లడించారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :