ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బాల‌య్య 108 స్టోరీ లైన్ ఇదే..!

బాల‌య్య 108 స్టోరీ లైన్ ఇదే..!

అఖండ, వీర‌సింహా రెడ్డి సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ స‌క్సెస్ అందుకున్న బాల‌య్య ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర నుంచి ఫ్యాన్స్ కు భారీగానే అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాలో బాలయ్య‌ను నెవ్వ‌ర్ బిఫోర్ అవ‌తార్‌లో చూపించ‌నున్నాడ‌ట అనిల్ రావిపూడి. 

రీసెంట్‌గా ఈ సినిమా గురించిన ఒక వార్త ఫిల్మ్ న‌గ‌ర్‌లో చక్క‌ర్లు కొడుతోంది. బాల‌య్య కెరీర్లో 108వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాల‌య్య ఆరు ప‌దుల పైబ‌డిన వ్య‌క్తిగా క‌నిపించ‌నున్నాడ‌ట‌. బాల‌య్య గెట‌ప్ విష‌యంలో క‌చ్చితంగా ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయిస్తాన‌ని ఎంతో ధీమా వ్య‌క్తం చేస్తున్నాడు అనిల్ రావిపూడి. 

ఈ సినిమా స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి వినిపిస్తుంది. ముప్పై ఏళ్ల వ‌య‌సులో ఉన్న‌ప్పుడు చాలా అగ్రెసివ్ గా ఉండే హీరో ఒక కేసులో అనుకోకుండా ఏకంగా 14 ఏళ్ల పాటు జైల్లో ఉండాల్సి వ‌స్తుంది. జైలుకు వెళ్ల‌క ముందు హీరోకు ఒక భార్య‌, బిడ్డ‌కూడా ఉంటారు. 14 ఏళ్ల త‌ర్వాత జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన హీరో ఆరు ప‌దుల వ‌య‌సులో ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడ‌నేదే క‌థ‌గా తెలుస్తోంది. 

రెండు గెట‌ప్స్‌లో అనిల్ రావిపూడి బాల‌య్య‌ను చూపించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించిన కీ సీన్స్ షూటింగ్ పూర్తి అయింద‌ని తెలుస్తోంది. ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ సినిమాను ద‌స‌రాకు థియేట‌ర్ల‌లో దింపాల‌ని చూస్తున్నారు మేక‌ర్స్.

ఇక‌పోతే సినిమాలో బాల‌య్య కూతురు క్యారెక్ట‌ర్ లో హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీ లీల న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్ర‌క‌టన రాక‌పోయిన‌ప్ప‌టికీ పుకార్లు పెద్ద ఎత్తున వ‌స్తూ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తున్నాయి. ఈ సినిమాతో బాల‌య్య హ్యాట్రిక్ కొడ‌తాడేమో చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :