ASBL NSL Infratech

వాట్సప్ లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్!

వాట్సప్ లో  కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్!

వాట్సప్‌ కమ్యూనిటీ కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గ్రూప్‌ మెసేజ్‌లలో ఈవెంట్‌లను ప్లాన్‌ చేయడానికి, నిర్వహించడానికి వాట్సప్‌ కొత్త మార్గాన్ని తీసుకొచ్చింది. తద్వారా స్నేహితులు, స్కూళ్లు, సన్నిహితులతో వర్చువల్‌, వ్యక్తిగత సమావేశాలను సెటప్‌ చేయడాన్ని మరింత సులభతరం చేస్తోంది. ఇ-మెయిల్‌ ద్వారా ఆహ్వానాలను పంపే వివిధ ఇ`వైట్‌  సేవల్లాగే  కొత్త ఈవెంట్స్‌ ఫీచర్‌ పనిచేస్తుంది. గ్రూప్‌ సభ్యుల పుట్టినరోజు పార్టీలు, వర్క్‌, మీటింగ్‌లను సెటప్‌ చేయడానికి ఇది అనుమతిస్తుంది. కొత్త ఈవెంట్‌, గ్రూప్‌ ఇన్ఫర్మేషన్‌ పేజీకి పిన్‌ అయ్యి ఉంటుంది. గ్రూప్‌ చాట్‌  థ్రెడ్‌ క్రియేట్‌ అవుతుంది. తద్వారా ఎవరెవరికీ మెసేజ్‌ చేరిందో తెలుసుకోవచ్చు. అలాగే ఈవెంట్‌కు వచ్చేవారు రిప్లయ్‌ ఇచ్చి కన్ఫర్మ్‌ చేయొచ్చు. వారికి ఈవెంట్‌ సమయానికి నోటిఫికేషన్‌ కూడా వెళుతుంది. ఈ ఫీచర్‌ తొలుత వాట్సప్‌ కమ్యూనిటీలో తీసుకొస్తున్నారు. వచ్చే కొన్ని నెలల్లో వాట్సప్‌ గ్రూప్‌లకు యాడ్‌ చేయనున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :