ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

365 రోజులపాటు శతపురుషుని శత జయంతి వేడుకలు : నందమూరి బాలకృష్ణ

365 రోజులపాటు శతపురుషుని శత జయంతి వేడుకలు : నందమూరి బాలకృష్ణ

అభిమానులకు.. తెలుగునేలకు..  విశ్వవ్యాప్తంగా వెలుగులీనుతున్న తెలుగుజాతికి..  
నందమూరి బాలకృష్ణ నమస్సుమాంజలి….

మా నాన్నగారు సినీరంగంలో అడుగుపెట్టారు. భారతీయసినిమా తెలుగుసినిమాని తలఎత్తి చూసింది.. తెలుగుదేశంపార్టీని స్థాపించారు.. తెలుగుసంస్కృతి తలఎత్తి నిలబడింది.. ఆ నందమూరి తారక రామునికి   నెల 28 తేదీతో నూరవ ఏడు మొదలవుతుంది.. రోజు నుంచి, 2023 మే 28 వరకు, 365 రోజులపాటు శతపురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచేరగులా జరుగనున్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను.. మునుపెన్నడూ కనీవినీ ఎరుగనివిధంగా ఎన్నో దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు మా నందమూరి కుటుంబం హాజరవుతుంది.. ఆనందంలో పాలుపంచుకుంటుంది…        

మా కుటుంబం నుంచి నెలకొక్కరు నెలకో కార్యక్రమంలో భాగస్వాములవుతారు..  అందులో భాగంగా నేను 28వ తేదీ ఉదయం మా స్వస్థలం నిమ్మకూరు వెళ్ళి, అక్కడి వేడుకలలో పాల్గొంటాను..  వందేళ్ల క్రితం మా నాన్నగారిని జాతికందించింది నిమ్మకూరు కనుక అది నా బాధ్యత.. అక్కడి నుంచి కళలకాణాచిగా ఖ్యాతిగాంచిన తెనాలి చేరుకుంటాను. అక్కడ జరిగే శతాబ్ది వేడుకలను  నా చేతులమీద ప్రారంభిస్తున్నాను..  365రోజులు.. వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు.. నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలు.. ఈమహత్కార్యాన్ని పెమ్మసాని(రామకృష్ణ) థియేటర్ లో ప్రారంభించి, ఒంగోలు వెళ్ళి మహానాడు లో పాల్గొంటానని తెలుగుజాతికి తెలియజేస్తున్నాను..

అహర్నిశలు మీ అభిమానం కోసం మీ నందమూరి బాలకృష్ణ.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :