ASBL NSL Infratech

నల్లారి వర్సెస్ పెద్దిరెడ్డి కుటుంబం..

నల్లారి వర్సెస్ పెద్దిరెడ్డి కుటుంబం..

చిత్తూరు జిల్లా పాలిటిక్స్‎లో ఆ రెండు కుటుంబాలకు సుదీర్ఘ రాజకీయ చరిత్రే ఉంది. నాలుగు దశాబ్దాలుగా ఆరెండు కుటుంబాలు రాజకీయాల్లో కొనసాగుతున్నాయి. ఇరు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. అయితే ఇప్పటివరకూ ఆరెండు కుటుంబాలు డైరెక్టుగా ఎన్నికల బరిలో తలపడలేదు. ఇప్పుడు నేరుగా ఢీ అంటే ఢీ అంటున్నాయా రెండు కుటుంబాలు. అదే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నల్లారి..పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఇప్పుడు ఎన్నికల్లో ప్రత్యర్థులుగా కత్తులు దూసుకునేందుకు కారణం అయ్యింది.

2024 సార్వత్రిక ఎన్నికల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి తండ్రి కొడుకులు.. నల్లారి కుటుంబం నుంచి అన్నదమ్ములు పోటీలో ఉండడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. రాజకీయ శత్రుత్వం ఉన్న రెండు కుటుంబాల మధ్య పోటీ చర్చకు దారి తీసింది.. రాజంపేట పార్లమెంట్ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన బిజెపి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, వైసిపి సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. పేరుకు వ్యక్తుల మధ్య పోటీ అయినా ఫైట్ నల్లారి వర్సెస్ పెద్దిరెడ్డి‎గా మారింది. రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పుంగనూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న కొడుకు మిధున్ రెడ్డి టార్గెట్‎గానే మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని అనుచరుల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు పీలేరు అసెంబ్లీ నుంచి మాజీ సీఎం కిరణ్ సోదరుడు కిషోర్ టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో కూటమి అభ్యర్థులుగా ఉన్న అన్నదమ్ముల ఓటమి లక్ష్యంగా పెద్దిరెడ్డి వ్యూహలు పన్నుతున్నారు. నల్లారి కిరణ్, నల్లారి కిషోర్ ఇద్దరినీ ఓడించాలని కంకణం కట్టుకున్న పెద్దిరెడ్డి ఈ మేరకు దూకుడు పెంచారు. దీంతో నల్లారి – పెద్దిరెడ్డి మధ్య ఘాటైన విమర్శలు పొలిటికల్ హీట్‎ను పుట్టిస్తున్నాయి.

ఈమధ్యనే పుంగనూరులో కూటమి నేతల ఆత్మీయ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి‎పై కిరణ్ చేసిన కామెంట్స్‎కు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్ అటాక్ ఇచ్చారు. రొంపిచర్లలో పర్యటించిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇఫ్తార్ విందులో పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ పాడి, మామిడి రైతాంగాన్ని నిలువు దోపిడీ చేస్తోందని ఆరోపించారు. అభివృద్ధి అంటే పెద్దిరెడ్డి కుటుంబం మాత్రమే అభివృద్ధి అన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం చేసిన ప్రాజెక్ట్ పనులను ప్రస్తావిస్తున్న నల్లారి కిషోర్.. పెద్దిరెడ్డి కుటుంబం అధికార మదంతో రెచ్చిపోతుందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో పెద్దిరెడ్డి హవా నడుస్తోంది. అధికార పార్టీ , క్యాబినెట్ ర్యాంకు ఉండడంతో.. ఆయన చెప్పిందే వేదంగా జరుగుతోంది.

మరీ ముఖ్యంగా సీఎం జగన్ దగ్గర.. మిథున్ రెడ్డి వాయిస్ కు చాలా విలువ ఉందంటారు. అందువల్లే చిత్తూరు జిల్లాలో చంద్రబాబు టార్గెట్ గా పెద్దిరెడ్డి రాజకీయాలు నడిపారు. అయితే నల్లారి ఫ్యామిలీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాకలు తీరిన కాంగ్రెస్ రాజకీయాల్లో సీఎం అయ్యారంటే కిరణ్ వ్యూహచతురత అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. సొంత వర్గం అనుచరులు, అభిమానులు సైతం ఉన్నారు. దీనికి తోడు కూటమి కూడా కలిసి వస్తుండడంతో .. పెద్దిరెడ్డి కుటుంబానికి నల్లారి మార్క్ షాక్ ట్రీట్ మెంట్ తప్పదంటున్నారు అభిమానులు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :