మరోసారి పోలీస్ పాత్రలో నాగ్?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో నాగ్ పాత్ర క్యామియో అనుకున్నారు కానీ ఆయన స్క్రీన్ టైమ్ పరంగా చూసుకుంటే ఇది మల్టీస్టారర్ అనే చెప్పాలి. కుబేర లో నాగార్జున పోలీస్ గా ఓ డిఫరెంట్ షేడ్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది.
నాగ్ క్యారెక్టర్ కు పట్టుకోవడానిఇ ప్రయత్నించి నిరాశ చెందే ఓ విభిన్న నేపథ్యం ఉంటుందట. ఎన్నో తెలివి తేటలున్నా చిల్లి గవ్వ లేని స్థితి నుంచి వేల కోట్లకు పడగలెత్తే కుబేర వెంటపడే ఆఫీసర్ గా నాగ్ పాత్రను డిజైన్ చేశాడట శేఖర్ కమ్ముల. ఇప్పటివరకు నాగార్జున మొత్తం 7 సార్లు ఖాకీ బట్టల్లో కనిపించాడు. ఆ ఏడింటిలో శివమణి మాత్రమే పెద్ద హిట్. మిగిలినవి ఓ మోస్తరు సినిమాలే.
ఇప్పుడు తిరిగి నాగ్ ఇన్నేళ్ల తర్వాత ఇలా కనిపించడం ఆయన ఫ్యాన్స్ కు పెద్ద పండగే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ లో నాగ్, ధనుష్ ఇద్దరూ పాల్గొంటున్నారు. కుబేర కు దేవీ శ్రీ సంగీతం చాలా పెద్ద ప్లస్ కానుందంటున్నారు. ఈ ఏడాదిలో కుబేర రిలీజవుతుందా లేదా అన్నది ఇంకా ఎలాంటి డెసిషన్ కు రాలేదు. ఒక వేళ వీలు పడకపోతే 2025 సంక్రాంతికి దింపాలని నాగ్ ప్లాన్. కానీ అప్పటికే చాలా సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. దానికి తోడు కుబేర విషయంలో తమిళ రిలీజ్ లను కూడా లెక్కలోకి తీసుకోవాలి కాబట్టి కుబేర రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రావాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.