MKOne Telugu Times Youtube Channel

ఈదివిలో విరిసిన పారిజాతం... బాలుకు బాటా ఘన నివాళి

ఈదివిలో విరిసిన పారిజాతం... బాలుకు బాటా ఘన నివాళి

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) గానగంధర్వుడు పద్మభూషణ్‌ ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. గత సంవత్సరం సెప్టెంబర్‌ 25వ తేదీన ఎస్‌.పి.బాలు కోవిడ్‌ ఇబ్బందులతో మరణించిన సంగతి విదితమే. సినిమారంగంలో దాదాపు 40,000కుపైగా పాటలు పాడి అందరిచేత గానగంధర్వుడు అని అనిపించుకున్న ఎస్‌.పి.బి. అన్నా, ఆయన పాటలన్నా ఇష్టపడేవారు లక్షల్లోకాదు...కోట్లలో ఉన్నారు. బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా)తో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. బాటా తరపున బే ఏరియాలో ఏర్పాటు చేసిన 15 సంగీత కచేరీలో ఆయన పాటలు పాడారు.

తానా మాజీ అధ్యక్షులు, కమ్యూనిటీ నాయకుడు జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, ఎస్‌.పి.బాలుగారితో తనకు ఎంతో అనుబంధం ఉందని, అలాంటి మహా గాయకుడిని మనం కోల్పోవడం దురదృష్టకరమన్నారు.

బాటా అడ్వయిజర్‌ ప్రసాద్‌ మంగిన మాట్లాడుతూ, బాలు మరణించి సంవత్సరం గడిచిందంటే నమ్మలేకపోతున్నామని భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన పాడిన పాటలు ఆయన్ని మన మధ్యే సజీవంగా ఉంచుతున్నాయని తెలిపారు. బాటా వైస్‌ ప్రెసిడెంట్‌ కొండల్‌రావు, కల్చరల్‌ అడ్వయిజర్‌ శ్రీదేవి పసుపులేటి, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌ శివ కడ కూడా ఎస్‌పిబితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగువారికి, శ్రోతలకు ఆయన మరణం తీర్చలేనిదన్నారు. 50/60/70 to 80/90/2000 ఇలా ఎన్నో సంవత్సరాలుగా ఆయన పాటలను పాడుతూ ఆ తరానికి నేటితరానికి మధ్య వారధిగా నిలిచారని వక్తలు తమ ప్రసంగంలో పేర్కొన్నారు.

బాటా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నాయకులు : హరినాథ్‌ చికోటి (ప్రెసిడెంట్‌), కొండల్‌రావు (వైస్‌ ప్రెసిడెంట్‌), అరుణ్‌ (సెక్రటరీ), శివ, వరుణ్‌ ముక్క
స్టీరింగ్‌ కమిటీ సభ్యులు : రవి, కామేష్‌, శిరీష, యశ్వంత్‌, సుమంత్‌
అడ్వయిజరీ బోర్డ్‌ సభ్యులు : జయరామ్‌ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్‌ మంగిన, రమేష్‌ కొండ, కరుణ్‌ వెలిగేటి, కళ్యాణ్‌ కట్టమూరి
కల్చరల్‌ కమిటీ సభ్యులు : శ్రీదేవి, శ్రీలు, దీప్తి
నామినేటెడ్‌ కమిటీ సభ్యులు : హరి సన్నిధి, సురేష్‌ శివపురం, శరత్‌ పోలవరపు
యూత్‌ కమిటీ సభ్యులు : సంకేత్‌, సందీప్‌, అది, క్రాంతి, ఉదయ్‌, హరీష్‌ తదితరులు కూడా ఎస్‌పిబితో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు. ఆయన పాటతోపాటు దానికి మాటలను జోడించి అందరినీ ఆకట్టుకునేవారని వారు చెప్పారు.

పాటలు పాడిన గాయకులు

రవి గూడిపాటి, శ్రీకృష్ణన్‌, శేష ప్రసాద్‌, రాజా గోవర్ధన్, శ్రీధర్‌ గణపతి, సచిన్‌ శ్రీవాత్సవ, కృష్ణ రాయసం, త్రినాథరావు, సుచిత్ర దేవులపల్లి, మానస గాదేపల్లి, విజయ గోపరాజు కృతిక బురెడ్డి, షోహిణి చక్రవర్తి, మురళి గండ్లూరు, ప్రకాశ్‌ కోట్ల, నవ్య వేమూరి, మాల తంగిరాల, కిషోర్‌ నిట్టల, నవీన్‌ పొటోల్ల, బాలాజీ తమిరిశ, శరణ్య, మురళీ కృష్ణ, రామకృష్ణన్‌ వి. ప్రసాద్‌ బి, శ్రీనివాస తగిరిశ, ప్రసాద్‌ పాడారు.

Click here for Event Gallery

 

Tags :