ASBL NSL Infratech

సీబీఐ అరెస్ట్... కోర్టులో కవితకు చుక్కెదురు

సీబీఐ అరెస్ట్...  కోర్టులో కవితకు చుక్కెదురు

ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ అరెస్టును సవాల్‌ చేస్తూ ప్రత్యేక కోర్టులో అత్యవసర విచారణకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు చేసినా ఊరట దక్కలేదు.  ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్‌ కుమార్‌ బెంచ్‌ ముందు కవిత తరపు న్యాయవాది మోహిత్‌రావు పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, తన ఎదుట మద్యం కేసుకు సంబంధించి ఎలాంటి వాదనలు జరగలేదన్న న్యాయమూర్తి, ఈ కేసులో ఎలాంటి ఊరట ఇవ్వలేనని స్పష్టం చేశారు. కేసు గురించి ఎలాంటి సమాచారం లేదని,  తనకు ఏ విషయం తెలియదన్నారు. అత్యవసర కేసులకు సంబంధించి వాదనలు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. శుక్రవారం రెగ్యులర్‌ కోర్టులో దరఖాస్తు చేయాలని ప్రత్యేక కోర్టు జడ్జి మనోజ్‌ కుమార్‌ సూచించినట్టు న్యాయవాదా మోహిత్‌ రావు వెల్లడిరచారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :