ASBL NSL Infratech

తెలంగాణ పీసీపీ కీలక నిర్ణయం...ఎమ్మెల్యే జగ్గారెడ్డికి షాక్

తెలంగాణ పీసీపీ కీలక నిర్ణయం...ఎమ్మెల్యే జగ్గారెడ్డికి షాక్

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలనంగా మారారు. తాజాగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరి హాట్‌ టాపిక్‌గా నిలిచారు. సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని అన్నారు. రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే తనకు వ్యతిరేకంగా ఒక అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాలని చాలెంజ్‌ చేశారు. తనను సస్పెండ్‌ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. షోకాజ్‌ నోటీసు ఇస్తే సమాధానం చెబుతానని తెలిపారు. ఈ నేపథ్యంలో అధిష్ఠానం నిర్ణయం మేరకు టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఇచ్చిన అదనపు బాద్యతల నుంచి జగ్గారెడ్డిని తొలగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. కాగా, పార్లమెంట్‌ నియోజకవర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి జగ్గారెడ్డిని తప్పించింది. జగ్గారెడ్డి బాధ్యతలను మిగతా వర్కింగ్‌ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. అంజన్‌ కుమార్‌, అజారుద్దీన్‌, మహేష్‌ గౌడ్‌లకు రేవంత్‌ రెడ్డి ఈ బాధ్యతలను అప్పగించారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :