ASBL NSL Infratech

మైక్రోసాఫ్ట్ ఏఐ ప్రారంభం.. లక్ష మందికి

మైక్రోసాఫ్ట్ ఏఐ ప్రారంభం.. లక్ష మందికి

దేశంలో ఏఐ టెక్నాలజీస్‌,టూల్స్‌పై కనీసం లక్ష మంది డెవలపర్లకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌ ఒడిస్సీ ఏఐని ప్రారంభించింది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించే ప్రాజెక్ట్‌లోని పని చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు దేశవ్యాప్తంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. కృత్రిమ మేథను ఉపయోగించి సమస్యలను పరిష్కరించే నైపుణ్యం ఉన్న వర్క్‌ ఫోర్స్‌ అవసరం చాలా ఉందని పేర్కొంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏఐ ఒడిస్సీలో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. నెల రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం రెండు దశలుగా ఉంటుందని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది.

జనవరి 31లోగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని కోరింది. మొదటి దశ ప్రోగ్రామ్‌లో అజూర్‌ ఏఐని ఎలా ఉపయోగించాలో పాల్గొనేవారికి అవగాహన కల్పిస్తారు. విభిన్న ఏఐ పరిష్కారాలను రూపొందించడానికి, అమలు చేయడానికి వారికి యాక్సెస్‌ ఇస్తుంది. ఏఐ నైపుణ్యాలను నేర్చుకోవడానికి కోడ్‌ శాంపిల్స్‌, గైడ్స్‌ను అందిస్తుంది. రెండో దశలో ఆన్‌లైన్‌ ఎసెస్‌మెంట్లను పూర్తి చేయడం ద్వారా ఏఐలో తమ నైపుణ్యాలను నిరూపించుకోవాల్సి ఉంటుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :