ASBL NSL Infratech

డీప్ ఫేక్ లపై సత్యనాదెళ్ల ...ఆందోళన

డీప్ ఫేక్ లపై  సత్యనాదెళ్ల ...ఆందోళన

ఇటీవల కాలంలో నెట్టింట్లో వెలుగులోకి వస్తోన్న సెలబ్రిటీల డీప్‌ఫేక్‌ వీడియోలు, చిత్రాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ప్రముఖ పాప్‌ సింగర్‌ టేలర్‌స్విప్ట్‌ కు చెందిన తీవ్ర అభ్యంతరకర డీప్‌ఫేక్‌ దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. ఈ ట్రెండ్‌పై మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల మాట్లాడుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుర్వినియోగం భయానకమైనది. దీనిపై వేగంగా స్పందించడం అవసరం అని నేను భావిస్తున్నాను. ఆన్‌లైన్‌లో సురక్షితమైన సమాచారం మాత్రమే అందుబాటులో ఉంటుందని నిర్ధారించేందుకు కట్టుదిట్టమైన నిబంధనలు ఉండాలి. డీప్‌ఫెక్‌ల కట్టడికి దర్యాప్తు సంస్థలు, టెక్‌ సంస్థలు కలిసివస్తే, మనం అనుకున్న దానికంటే ఎక్కువగా వాటిని అరికట్టవచ్చు అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :