ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రిషి సునాక్ కు షాక్.. ఈసారి గెలవడం కష్టమే

రిషి సునాక్ కు షాక్.. ఈసారి  గెలవడం కష్టమే

బ్రిటన్‌లో సాధారణ ఎన్నికలు జరిగితే భారత సంతతికి చెందిన రిషి సునాక్‌తో పాటు ఆయన కేబినెట్‌లోని సగానికి పైగా మంత్రులకు పరాజయం తప్పదని ముందస్తు సర్వేలో తేలింది. అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి 100 పార్లమెంట్‌ స్థానాలు కూడా దక్కడం గగనమేనని, అదే సమయంలో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ 468 సీట్లు గెలుచుకుని, 286 సీట్ల మెజారిటీ సాధిస్తుందని కూడా అంచనా వేసింది. బెస్ట్‌ ఫర్‌ బ్రిటన్‌ తరపున సర్వేషన్‌ సంస్థ 15,029 మందితో తాజాగా సర్వే జరిపింది. ఇందులో పాల్గొన్న వారిలో 45 శాతం మంది ప్రతిపక్ష లేబర్‌ పార్టీకే ఓటేశారు. పాయింట్ల వారీగా చూస్తే అధికార కన్జర్వేటివ్‌ పార్టీ కంటే లేబర్‌ పార్టీ 19 పాయింట్లు ముందంజలో ఉంది. గత  ఏడాది డిసెంబర్‌ లో చేపట్టిన పోలింగ్‌తో పోలిస్తే ఇది మూడు పాయింట్లు ఎక్కువ. కన్జర్వేటివ్‌ పార్టీ 100 లోపే సీట్లు గెలుచుకోవడం అంటే 250 ఎంపీ స్థానాలను కోల్పోవడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారవుతుందని నిర్వాహకులు విశ్లేషిస్తున్నారు.

సొంత సీటు రిచ్‌మండ్‌ అండ్‌ నార్త్‌ అల్లెర్టన్‌లో ప్రధాని  రిషి సునాక్‌కు లేబర్‌ పార్టీ కంటే 2.4 శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఈ పోలింగ్‌ ఎటూ వైపు మొగ్గు చూపని 15 శాతం మంది ఓట్లను పరిగణనలోకి తీసుకోలేదని సర్వేషన్‌ తెలిపింది.  కన్జర్వేటివ్‌ పార్టీ పరిస్థితి మున్ముందు మరింత దారుణంగా ఉంటుందని ఓ విశ్లేషకుడు అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :