ASBL NSL Infratech

భారత్ అప్రమత్తం ఎలాంటి పరిస్థితినైనా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా

భారత్ అప్రమత్తం ఎలాంటి పరిస్థితినైనా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా

ప్రపంచాన్ని చైనా మళ్లీ భయపెడుతున్నది. మైకోప్లాస్మా న్యుమోనియా, ఇన్‌ఫ్లుయెంజా కేసులు ఒక్కసారిగా పెరగడంతో భారత్‌ అప్రమత్తమైంది. చైనాలో పరిస్థితిని జాగ్రత్తగా పర్వవేక్షిస్తున్నామని, అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. పొరుగు దేశంలో కేసుల పెరుగుదలను ఐసీఎంఆర్‌, ఆరోగ్య సేవల డైరెక్టర్‌ జనరల్‌ పర్వవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా  ఉన్నట్లు చెప్పారు.  చైనాలోని చాలా ప్రాంతాలో ఇటీవల హెచ్‌9ఎన్‌2, న్యుమోనియా కేసులు ఒక్కసారిగా పెరగడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. అయితే, చైనాలో కేసులు పెరుగుదల వల్ల భారత్‌కు వచ్చే ప్రమాదమేమీ  లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇది మనషుల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశం తక్కువని, అలాగే మరణాలు రేటు కూడా తక్కువేనని స్పష్టం చేసింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :