ASBL NSL Infratech

కేజీఎఫ్3.. హింట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ‌

కేజీఎఫ్3.. హింట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ‌

ఇండియ‌న్ ఆడియ‌న్స్‌ను ఓ ఊపు ఊపిన కేజీఎఫ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. భాష‌తో సంబంధం లేకుండా ఈ సినిమాను ప్ర‌తి ఒక్క‌రూ ఓన్ చేసుకున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్2 రెండూ కూడా టాక్ తో సంబంధం లేకుండా బ్లాక్‌బ‌స్ట‌ర్లుగా నిలిచాయి. గ‌తేడాది ఇదే స‌మ‌యంలో రిలీజైన కేజీఎఫ్2 ఏకంగా 1200 కోట్లు వ‌సూలు చేసింది. 

అయితే ఈ సినిమా చివ‌ర్లో కేజీఎఫ్3 గురించి హింట్ ఇచ్చిన విష‌యం విదిత‌మే. అప్ప‌ట్లో హింట్ ఇచ్చారు అంతే కానీ అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు దాని గురించి ఎలాంటి చ‌ర్చ లేదు. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్ సినిమా స‌లార్ తో బిజీగా ఉన్నాడు. స‌లార్ త‌ర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయ‌నున్నాడు. 

స‌లార్‌2 కూడా వ‌స్తుంద‌ని వార్త‌లొస్తున్నాయి. ఇది కాకుండా ప్ర‌భాస్ తో మ‌రో సినిమా ఉంటుంద‌ని దిల్ రాజు మొన్నీమ‌ధ్య చెప్పుకొచ్చాడు. ఇన్ని సినిమాల మ‌ధ్య అస‌లు కేజీఎఫ్3 ఉంటుందా అని డౌట్లు ప్రేక్ష‌కుల్లో వ‌స్తున్నాయి. వీట‌న్నింటికీ చెక్ పెడుతూ కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిల్మ్ క‌చ్చితంగా కేజీఎఫ్3 ఉంటుంద‌ని తెలియచేస్తూ, ఈ సినిమా క‌థ విష‌యంలో కూడా ఓ హింట్ ఇస్తూ స్పెష‌ల్ వీడియోను ట్విట్ట‌ర్లో రిలీజ్ చేసింది. 

1978-1981 మ‌ధ్య‌లో అస‌లు రాకీ భాయ్ ఎక్క‌డున్నాడ‌నే ప్ర‌శ్న ఆ వీడియోలో లేవ‌నెత్తింది. ఇది కేజీఎఫ్‌3కి హింట్ అని అందరూ అనుకుంటున్నారు. ప్ర‌శాంత్ ఎప్పుడు సినిమా చేస్తాడో కానీ ఆ మూడేళ్ల‌లో రాకీ ఏం చేశాడ‌నే నేప‌థ్యంలోనే ఈ సినిమా ఉంటుంద‌నేది వీడియో ద్వారా క్లియ‌ర్ అయింది. మ‌రి ఈ సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుందో ఏమో చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :