మరొకసారి కవిత బెయిల్ పిటిషన్ వాయిదా..
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత కవితకు పెద్దగా అచ్చి రావడం లేదు. వరుస కస్టడీలు ఒకపక్క అయితే బెయిల్ కోసం ఆమె పెట్టుకున్న పిటిషన్లు వాయిదాలు మరొక పక్క అన్నట్లు ఉంది పరిస్థితి. తీహార్ జైల్లో ఉంటున్న కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. దీంతో కేసిఆర్ కుటుంబంలో కాస్త టెన్షన్ మొదలైంది. రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఈరోజు సెలవు తీసుకున్న నేపథ్యంలో ఆమె పిటీషన్ వాయిదా వేయడం జరిగింది. ఈనెల 22 లేక 23వ తేదీలలో దీనిపై న్యాయస్థానం వాదోపవాదాలు వింటుంది. కవిత తాను నిర్దోషినని.. అన్యాయంగా తనను మద్యం కేసులో ఇరికించారని.. తనకు బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టుకు పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటీషన్ పై విచారణ వాయిదా పడింది.
Tags :