ASBL NSL Infratech

టార్గెట్ 'డీకే' పాలిటిక్స్

టార్గెట్ 'డీకే' పాలిటిక్స్

కర్నాటక మంత్రి మండలి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఆదాయానికి మించి ఆస్తులు గడించారన్న ఆరోపణలపై కర్నాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్ పై సీబీఐ దర్యాప్తునకు గత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను కర్నాటక మంత్రిమండలి రద్దు చేసింది. సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం అజెండాలో ఈ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. శివకుమార్‌ మంత్రిమండలి సమావేశానికి హాజరుకాలేదు. సీబీఐ కోర్టులో ఇది వివాదం కావచ్చన్న ఉద్దేశంతోనే ఆయన సమావేశానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.

గతంలో యడియూరప్ప ప్రభుత్వం తనపై సీబీఐ దర్యాప్తునకు జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలంటూ డీకే శివకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టులో ఈనెల 29న విచారణ ప్రారంభంకానున్న నేపథ్యంలో మంత్రి మండలి తాజా నిర్ణయం తీసుకుంది. కాగా శివకుమార్‌పై జరుగుతున్న సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకునే అధికారం మంత్రిమండలికి లేదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, ప్రతిపక్షనేత ఆర్‌ అశోక్‌ క్యాబినెట్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

అయితే.. డికె శివకుమార్ మాత్రం తనపై ఆరోపణలు తిప్పికొడుతూనే ఉన్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదంటున్నారు. అంతే కాదు.. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలన్నారు. అయితే ఆయన పెద్దఎత్తున ఆక్రమాస్తులు కూడగట్టారంటూ .. గతంలో యడ్యూరప్ప ప్రభుత్వం సీబీఐ విచారణకు తీర్మానించింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారుతూ వచ్చాయి. ఇటీవలే దానిపై విచారణ స్పీడందుకుంది. ఈ తరుణంలో నవంబర్ 29 నుంచి విచారణ జరగనుండగా.. కర్నాటక ప్రభుత్వం నిర్ణయాన్ని రద్దుచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే డికె డిప్యూటీ సీఎంగా ఎన్నికైనప్పటి నుంచి ఆయనను.. విపక్షాలు టార్గెట్ చేశాయి. ప్రభుత్వానికి సంబంధించిన అన్నివ్యవహారాల్లోనూ డికె కీలకంగా ఉన్నారు. అంతే కాదు.. కాంగ్రెస్ హైకమాండ్ సైతం.. డికె మాటకు ఎనలేని విలువనిస్తోంది. ఇటీవల ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం .. డికె శివకుమార్ తీవ్రంగా శ్రమించారు. తనను జైల్లో వేసినప్పుడు కూడా.. ఆయన భయపడలేదు. దీంతో డికె.. పార్టీకి స్ట్రాంగ్ హోల్డయ్యారు. ఇక తెలంగాణ ఎన్నికలకు కూడా ట్రబుల్ షూటర్ గా డికెను .. కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. టికెట్ల ఎంపిక నుంచి ప్రచార పర్వం వరకూ అన్నింటా చాపకింద నీరులా డికె వ్యవహారాలను చక్కబెట్టారు. టికెట్లు రాని వారి నుంచి పెద్దఎత్తున నిరసనలు రాకుండా .. జాగ్రత్త పడ్డారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :