హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, ఉజ్జల్‌ భూయాన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు పుష్పగుచ్చం అందజేసి కేసీఆర్‌  శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనసభ స్పీకర్‌ పోచరం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు సత్యవతి రాథోడ్‌, నిరంజన్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు సురేశ్‌ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

 

Tags :