ASBL NSL Infratech

ఐపీఎల్ వేలంలో 'వరల్డ్ కప్' ఫ్లేవర్..

ఐపీఎల్ వేలంలో 'వరల్డ్ కప్' ఫ్లేవర్..

2024 ఐపీఎల్ వేలంలో చాలా వింతలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈసారి ఐపీఎల్ వేలం.. ప్రపంచ ఛాంపియన్లు ఆస్ట్రేలియన్లకు పట్టం కట్టింది. ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ ... 20 కోట్లకు పైన ధరను పలకడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ముఖ్యంగా మొన్న జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీమ్ ..ఇండియన్ టీమ్ ను చిత్తు చేసి ఆరోసారి కప్ గెల్చుకుంది. దీంతో వరల్డ్ కప్ హీరోలను .. ఐపీఎల్ ఫ్రాంచైజీలు నెత్తిన పెట్టుకున్నాయి.

ఇక వరల్డ్ కప్ ని అందుకున్న టీం లో ఉన్న ప్లేయర్లు భారీ ఎత్తున ఎక్కువ ధరను పలుకుతూ అమ్ముడుపోయారు. ఇక ఇప్పటికే ట్రవిస్ హెడ్ ని 6 కోట్ల 80 లక్షలకు సన్ రైజర్స్ టీం కొనుగోలు చేసింది. అలాగే పాట్ కమ్మిన్స్ ని కూడా సన్ రైజర్స్ టీం 20 కోట్ల 50 లక్షల కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు మిచెల్ స్టార్క్ ని 24 కోట్ల 75 లక్షలకు కలకత్తా నైట్ రైడర్స్ టీం సొంతం చేసుకుంది. సాదారణంగా ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియన్లకు ఎప్పుడు మంచి ఆదరణ ఉంటూనే వస్తోంది. అయితే వరల్డ్ కప్ ఫ్లేవర్ కారణంగా ఈసారి...మరింత క్రేజ్ పెరిగిందని చెప్పక తప్పదు.

ఇండియాలో కేప్డ్ ప్లేయర్స్ కు కూడా మంచి ధరే పలికింది. శార్దూల్, హర్షల్ పటేల్, ఉమేష్ యాదవ్.. సహా పలువురు ఆటగాళ్లకు 2కోట్ల రూపాయల ధర లభించింది. మిగిలిన ఆటగాళ్లు 50 లక్షలను కేటాయించాయి ఫ్రాంచైజీలు. అయితే పెద్ద ఆటగాళ్లు, కీలక ఆటగాళ్లను.. ఫ్రాంచైజీలు వదులుకోలేదు.

అయితే ఐపీఎల్ వేలంలో అధిక ధర పలికిన చాలా మంది ఆటగాళ్లు...తమ జట్లకు సరైన న్యాయం చేయడంలో విఫలమైన ఘటనలు చరిత్రలో చాలా ఉన్నాయి. కేవలం డిబట్ ఆటగాళ్లుగా బరిలోకి దిగి, సంచలనాలు సృష్టించిన కుర్రాళ్లు ఉన్నారు. మరి ఈసారి అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు.. ఆయా జట్లకు ఎంతవరకూ న్యాయం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. దీన్ని బట్టి చూస్తే 2024 ఐపిఎల్ అనేది చాలా రసవత్తరం గా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :