ASBL NSL Infratech

సుప్రీంకోర్టు తొలి న్యాయమూర్తి ఫాతిమా బీవి ఇక లేరు

సుప్రీంకోర్టు తొలి న్యాయమూర్తి ఫాతిమా బీవి  ఇక లేరు

సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఫాతిమా బీవి (96) కన్ను మూశారు. కేరళలోని కొల్లంలో ఓ ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ  ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జస్టిస్‌ ఫాతిమా భౌతికకాయాన్ని పథనంథిట్టలోని ఆమె స్వగృహానికి తరలించారు. అక్కడ జుమా మసీదులో అధికార లాంఛనాలతో ఆమె ఖననం జరగనుంది. గతంలో ఆమె తమిళనాడు గవర్నర్‌గా కూడా పని చేశారు. జస్టిస్‌ ఫాతిమా బీవి 1927, ఏప్రిల్‌ 30న కేరళలోని పథనంధిట్టలో జన్మించారు. తండ్రి ప్రోత్సాహంతో అమె న్యాయవాద విద్య అభ్యసించారు. 1983 నుంచి 1989 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 1989 అక్టోబరు 6 నుంచి 1992 ఏప్రిల్‌ 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :