ASBL NSL Infratech

అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం

అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం

గాజాలో అమెరికా-హమాస్‌ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో  ప్రకంపనలు రేపుతోంది. గత కొన్ని రోజులుగా పాలస్తీనాకు అనుకూలంగా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా వర్సిటీల్లో జరుగుతున్న ఆందోళనలు ఉద్ధృతరూపం దాలుస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు పోలీసులను రంగంలోకి దింపాయి. భారీ సంఖ్యలో అరెస్టులు నమోదవుతున్నాయి. బోస్టన్‌లోని ఎమర్సన్‌ కళాశాలలో 108 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. సదరన్‌ కాలిఫోర్నియా వర్సిటీలో 93 మంది అరెస్టయ్యారు. ఈ మొత్తం ఆందోళనలకు కేంద్రంగా నిలిచిన కొలంబియా  యూనివర్సిటీలో ఉద్రికత్తలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక్కడి విద్యార్థులతో వర్సిటీ అధికారులు చర్చలు జరుపుతున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :