ASBL NSL Infratech

అమెరికాను చిత్తు చేసిన భారత్

అమెరికాను చిత్తు చేసిన భారత్

అండర్‌ 19 ప్రపంచకప్‌లో యువ భారత క్రికెట్‌ జట్టు హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసుకుంది. ఇప్పటికే సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధించిన యంగ్‌ ఇండియా 201 పరుగుల తేడాతో అమెరికాను చిత్తుచేసిది. మొదట యువ భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఓపెనర్‌ అర్షిన్‌ కులకర్ణి (108: 8 ఫోర్లు, 3 సిక్సర్లు) శతక్కొటగా, ముషీర్‌ కాన్‌ (73) రాణించాడు. అనంతరం అమెరికా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే  పరిమితమైంది. మన బౌలర్లలో నమన్‌ తివారీ 4 వికెట్లు పడగొట్టాడు. అర్షిన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :