యూఎస్ అధికారులు ప్రధాని మోదీ ప్రస్తావనపై.... భారత్ అభ్యంతరం

యూఎస్ అధికారులు ప్రధాని మోదీ ప్రస్తావనపై.... భారత్ అభ్యంతరం

సౌదీ అరేబియా పాలకుడు మొహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌కు అమెరికాలో విచారణ నుంచి మినహాయింపు ఉన్న విషయాన్ని తెలిపే క్రమంలో ప్రధాని మోదీ ప్రస్తావనను అమెరికా అధికారులు తీసుకురావడంపై భారత్‌ అభ్యంతరం తెలిపింది. సందర్భ రహితంగా ఈ అంశాన్ని తీసుకొచ్చారని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్ఛి పేర్కొన్నారు. పాత్రికేయుడు ఖషోగ్గి హత్య వ్యవహారంలో ఆరోపణలున్న మొహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌పై అమెరికాలో కేసు నమోదైంది. ఒక దేశ పాలకుడిగా కొన్ని  రక్షణలుంటాయని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియాకు తెలిపారు.  అదే సమయంలో గతంలో  భారత ప్రధాని మోదీకి, మరికొందరు నేతలకు కూడా ఈ మినహాయింపు లభించిందని పేర్కొన్నారు. ఈ ప్రస్తావనపై భారత్‌ మండిపడింది.

 

Tags :