ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఇండియా కూటమి ఆపరేషన్ సౌత్..

ఇండియా కూటమి ఆపరేషన్ సౌత్..

సౌత్ లో వంద సీట్లపైనే కన్ను..

ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని నిలువరించడంపై ఇండియా అలయెన్స్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ భాగస్వామ్య పక్షాలతో కలిసి పోటీ చేస్తోంది.ముఖ్యంగా మొత్తం సీట్లలో ఐదువంతు దక్షిణాదిలోనే ఉన్నాయి.ఈసారి ఆసీట్లను గట్టిపట్టు పట్టాలని ఇండియా అలయెన్స్ భావిస్తోంది. ఈ స్థానాల్లోనే అత్యధికంగా అంటే వందకు పైగా స్థానాలను సాధించాలని ప్రయత్నిస్తోంది. ఎందుకంటే సౌత్ లో బీజేపీకి అంత పట్టులేదు. దీంతో మిత్రపక్షాలతో కలిసి వీలైనన్ని సీట్లను బ్యాగ్ లో వేసుకోవాలని భావిస్తోంది.

లోక్ సభలో మ్యాజిక్ నెంబర్ 273 అనుకుంటే.. అందులో వందకంటే ఎక్కువ స్థానాలను సౌత్ లోనే సాధిస్తే.. ఢిల్లీపీఠానికి చేరువ అవ్వొచ్చన్నది కాంగ్రెస్ ముఖ్యంగా ఇండియా అలయెన్స్ భావనగా తెలుస్తోంది. దక్షిణ భారతంలో.. అందునా కర్ణాటక(28), తెలంగాణ(17), తమిళనాడు(39), కేరళ(20), ఒడిస్సా(21), ఏపీ(25) లోక్ సభ సీట్లు ఉన్నాయి. ఇందులో ఏపీ, ఒడిస్సాల్లో ఇండియా అలయెన్స్ కు పెద్దగా సీట్లు వచ్చే పరిస్థితి లేదు. మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం అధిక సీట్లు దక్కించుకునే పరిస్థితి కనిపిస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ, కర్నాటకల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లోనే అధికశాతం ఎంపీ స్థానాలను కొల్లగొట్టాలన్నది కాంగ్రెస్ భావనగా కనిపిస్తోంది. కేరళ, తమిళనాడుల్లో పెరిగే అవకాశమే లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో కేరళలో మిత్రపక్షాలతో కలిసి 20కి గరిష్ఠంగా 19 చోట్ల గెలిచింది. తమిళనాడులో కూడా అదే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కటీ రాకపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఇక హిందీ బెల్ట్‌ రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయింది. అందుకే ఆ పార్టీ ఈసారి మరీ ఎక్కువ సీట్లను ఆశించడం లేదు.

సౌత్ లో వంద స్థానాలు కానీ రాబట్టగలిగితే, ఆమేరకు ఎన్డీఏ సాధించబోయే సీట్లకు గండికొట్టొచ్చన్న అంచనాలున్నాయి. అయితే ఇది గుర్తించే బీజేపీ సైతం పక్కాగా చర్యలు తీసుకుంటోంది. ఓవైపు గతంలో ఎన్డీఏ నుంచి బయటకుపోయిన టీడీపీని అందుకే కూటమిలోకి ఆహ్వానించినట్లు కనిపిస్తోంది. ఒడిసాలో పాలకపార్టీ బీజేడీని ఆహ్వానించినప్పటికీ... బీజేపీ కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు నవీన్ పట్నాయక్ అంగీకరించకపోవడంతో పొత్తు పెటాకులైంది. సౌత్ టార్గెట్ వందసీట్లు సాధించడంపైనే కాంగ్రెస్, మరీ ముఖ్యంగా ఇండియా అలయెన్స్ భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పొచ్చు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :