MKOne Telugu Times Business Excellence Awards

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా జేసీగా ఆర్‌. గోవిందరావు, అన్నమయ్య జిల్లా జేసీగా పర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన తరగతుల ఆర్థిక కార్పొరేషన్‌కు వీసీ, ఎండీగా క్రైస్ట్‌ కిశోర్‌, ఏపీ భవన్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌గా హిమాన్షు కౌశిక్‌, కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఎ.భర్వత్‌ తేజను నియమించింది. ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డిపార్టుమెంట్‌ డైరెక్టర్‌గా వి. ఆంజనేయులు, స్వామిత్వ స్పెషల్‌ కమిషనర్‌గా ఎ.సిరి. ఆయుష్‌ కమిషనర్‌గా ఎస్‌.బి.ఆర్‌ కుమార్‌లకు బాధ్యతలు అప్పగించింది. 

 

 

Tags :