SSMB #28 మూవీ కోసమా? మహేష్ పోస్ట్ చేసిన ఈ న్యూ లుక్

సూపర్ స్టార్ మహేష్ బాబు Loving the new vibe... 😎 అంటూ న్యూ లుక్‌లో ఉన్న పిక్‌ను ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం యాడ్స్ షూటింగ్‌లో ఉన్న మహేష్.. త్వరలో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో SSMB 28 మూవీ కోసం రెడీ అవుతున్నాడు. చాలా గ్యాప్ తరువాత ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్‌కు వెళ్లి వచ్చాడు. ఇటీవలె తన పుట్టినరోజు వేడుకలను కూడా ఘనంగా జరుపుకున్నాడు. ప్రస్తుతం యాడ్ షూటింగ్స్ బిజీగా ఉన్నాడు. టీవీసీ కంపెనీ యాడ్ షూట్‌లో ఉన్నప్పటి పిక్‌ను నమ్రాత శిరోద్కర్ షేర్ చేయగా.. వైరల్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా మహేష్ బాబు సరికొత్త లుక్‌లో ఉన్న పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. లవింగ్ న్యూ వైబ్.. సరికొత్త లుక్‌లో సూపర్ స్టార్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. వైట్ టీషర్ట్ వేసుకున్న మహేష్.. సరికొత్త హెయిర్ స్టైల్‌లో దేనికోసమే చూస్తున్నట్లు ఆ పిక్ ఉంది. కూల్ లుక్, లుకింగ్ సూపర్, బాస్ ఈజ్ దేర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. బర్త్ డే తరువాత సూపర్ స్టార్ తొలి పిక్ షేర్ చేసుకోవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
త్వరలోనే త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు మహేష్ బాబు. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని మూవీ యూనిట్ ఇదివరకే ప్రకటించింది. మహేష్ బాబు సరసన అందాల తార పూజాహెగ్డే మరోసారి హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో అతడు, ఖలేజా చిత్రాలు రాగా.. మళ్లీ దాదాపు పుష్కరకాలం తరువాత వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయింది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో థియేటర్స్ ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా తరువాత దుర్గ ఆర్ట్స్ లో రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు నటించనున్నాడు.