ASBL NSL Infratech

బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ కు ఎందుకంత భయం? : హరీశ్ రావు

బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ కు ఎందుకంత భయం? : హరీశ్ రావు

రుణమాఫీ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌ మాట్లాడుతూ అన్ని గ్యారంటీలతో పాటు రుణమాఫీ హామీని ఆగస్టు 15లోపు నెరవేరుస్తామని సీఎం ప్రమాణం చేయాలని ఆయన సవాల్‌ విసిరారు. సీఎం సవాల్‌ స్వీకరిస్తున్నా. ఇచ్చిన హామీలు అధికార పార్టీ నెరవేర్చేలా చేసే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు నేను వస్తా. సీఎం రేవంత్‌ కూడా అక్కడికి వచ్చి ఆగస్టు 15 లోపు రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేస్తానని ప్రమాణం చేయాలి. హామీని నిలబెట్టుకుంటే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్లీ ఉప ఎన్నికలోనూ పోటీ చేయను. మాఫీ చేయకపోతే సీఎం పదవికి రేవంత్‌ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.

నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం. ఆరు గ్యారంటీలను డిసెంబర్‌ 9న అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ ఆ మాట తప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే పార్టీ రద్దు చేసుకుంటారా అని తొండి మాటలు మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చి 120 రోజులైంది. మీ గ్యారంటీలు ఏమయ్యాయి? మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2500, రైతులకు రూ.15,000 నిరుద్యోగులకు భృతి ఎందుకు ఇవ్వలేదు? బీఆర్‌ఎస్‌ అంటే కాంగ్రెస్‌కు ఎందుకంత భయం? అని ప్రశ్నించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :