ASBL NSL Infratech

కేంద్రం కీలక ప్రకటన.. ఆందోళన వద్దు

కేంద్రం కీలక ప్రకటన.. ఆందోళన వద్దు

చైనాలో హెచ్‌9 ఎన్‌2 ఇన్ఫెక్షన్‌ వ్యాప్తి ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. ఆ దేశంలో ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ ఇన్ఫెక్షన్‌కి గురై అనారోగ్యం బారిన పడుతున్నారు. చైనాలో చిన్నారుల్లో హెచ్‌9ఎన్‌2 ఇన్ఫెక్షన్‌ (న్యు మోనియా) కేసులు పెరుగుతుండటాన్ని నిశితంగా పరిశీలిస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ దేశంలో అక్టోబరులో బయటపడిన ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజాతో పాటు తాజాగా బయపటడుతున్న న్యూమోనియా కేసుల వల్ల భారతీయులకు తక్కువ ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఎటవంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, గత కొన్ని వారాలుగా చైనాలో శ్వాసకోశ సమస్యల కేసులు పెరుగుతున్నట్లు గుర్తించామని వెల్లడించింది. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్‌ దేశం సిద్ధంగా ఉందని, ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించేందుకు సమగ్రమైన రోడ్‌ మ్యాప్‌ అనుసరించడానికి భారత్‌ ఒక ఆరోగ్య విధానాన్ని పాటిస్తుంది.  ముఖ్యంగా కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు గణనీయంగా బలోపేతం చేయడం జరిగింది అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :