Radha Spaces ASBL

న్యూయార్క్ పాఠశాలల్లో ఇక దీపావళికి... సెలవు

న్యూయార్క్ పాఠశాలల్లో ఇక దీపావళికి... సెలవు

అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ పాఠశాలలకు దీపావళిని సెలవు దినంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నర్‌ కేథీ హోచుల్‌ తాజాగా చట్టంపై సంతకం చేశారు. తద్వారా ఇక నుంచి భారతీయ కేలండర్‌ ప్రకారం పాఠశాలల దీపావళి సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. న్యూయార్క్‌లో విభిన్న సంస్కృతులకు చెందిన వారు జీవిస్తారు. ఆ భిన్నత్వాన్ని పాఠశాలల్లో సంబరంలా జరుపుకోవడం అవసరం అని ఒక ప్రకటనలో కేథీ పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ఇక్కడి హిందువులు హర్షం వ్యక్తం చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :