ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కేంద్ర ఎన్నికల సంఘంతో గూగుల్ జట్టు

కేంద్ర ఎన్నికల సంఘంతో గూగుల్ జట్టు

సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘంతో గూగుల్‌ జట్టు కట్టింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు కొన్ని చర్యలు చేపట్టింది. అధీకృత సమాచారం మాత్రమే ప్రజల్లోకి వెళ్లేలా చూడడంతో పాటు ఏఐని వినియోగించి రూపొందించే వీడియోలను లేబుల్‌ వేయాలని నిర్ణయించింది. ఎన్నికల్లో పాదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్‌ పేర్కొంది. ఓటరుగా పేరు ఎలా నమోదు చేసుకోవాలి? ఎలా ఓటు వేయాలి? వంటి సమాచారాన్ని సులువుగా తెలుసుకోవడం కోసం ఈసీతో జట్టు కట్టినట్లు గూగుల్‌ తెలిపింది. ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో ఈ సమాచారం లభిస్తుందని పేర్కొంది.  ఏఐని వినియోగించి రూపొందించే కంటెంట్‌ను గుర్తించడం సులభతరం చేసినట్లు గూగుల్‌ తెలిపింది. డీప్‌ఫేక్‌, మార్పింగ్‌ చేసిన వీడియోను కట్టడి చేసినట్లు పేర్కొంది. యూట్యూబ్‌లోని ఏఐ పీచర్లతో క్రియేట్‌ చేసిన కంటెంట్‌కు ఇప్పటికే లేబుల్‌ వేయడం ప్రారంభించామని వెల్లడించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :