ASBL NSL Infratech

గూగుల్ మ్యాప్స్ మరో కొత్త అప్డేట్.. ఇకపై ఆదా!

గూగుల్ మ్యాప్స్ మరో కొత్త అప్డేట్.. ఇకపై ఆదా!

ఇప్పటివరకు రూట్‌ తెలుసుకోవడానికి, షార్ట్‌కట్‌ల కోసం వేగం తెలుసుకోవడానికి ఉపయోగపడే గూగుల్‌ మ్యాప్స్‌ ఇకపై ఇంధనాన్ని ఆదా చేయడంలోనూ సాయపడనుంది. ప్రయాణ సమయంలో ఇంధనాన్ని ఆదా చేయడం కోసం గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్యూయెల్‌సేవింగ్‌ పేరుతో ఈ ఫీచర్‌ని యూజర్లకు పరిచయం చేసింది. ఇప్పటికే అమెరికా, ఐరోపా, కెనడాలో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ తాజాగా భారత్‌కూ తీసుకొచ్చింది. గూగుల్‌ మ్యాప్స్‌ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌ని ఎనేబల్‌ చేసుకుంటే, లైవ్‌ ట్రాఫిక్‌ అప్‌డేట్లు, రహదార్లు, ట్రాఫిక్‌ పరిస్థితులతో పాటు ఇంధన సామర్థ్యంపై అంచనా వేస్తుంది. వాహన వేగం, ఇంధన వినియోగం రెండిరటినీ పరిగణనలోకి తీసుకొని అందుకు అనునకూలమైన మార్గాన్ని చూపుతుంది.  ఎంచుకున్న మార్గం ఆధారంగా ఎంత మేరకు ఇంధనం ఖర్చవుతుందో తెలియజేస్తుంది. దీంతో ఇంధన ఆదే అయ్యే అవకాశం ఉంటుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :