ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

క్రీడా 'రాజకీయాల'కు రాంరాం...

క్రీడా 'రాజకీయాల'కు రాంరాం...

వారు బరిలో దిగారంటే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. పట్టుపట్టారంటే, పతకం రావాల్సిందే. భారత క్రీడారంగం విజయకేతనాన్ని .. అంతర్జాతీయ వేదికపై సగర్వంగా ఎగురవేసిన ఆ క్రీడాకారులు.. ఇప్పుడు కుమిలిపోతున్నారు. అగ్రశ్రేణి రెజ్లర్లు.. సాక్షి మలిక్‌, వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియా స్వదేశంలో న్యాయం కోసం చేసిన పోరాటంలో ఓడిపోయామనే బాధతో ఉన్నారు.

డబ్ల్యూఎఫ్‌ఐకి నిర్వహించిన ఎన్నికల్లో బ్రిజ్‌భూషణ్‌కు అత్యంత నమ్మకస్థుడు సంజయ్‌ సింగ్‌ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం... రెజ్లర్లకు మనస్తాపాన్ని కలిగించింది. ఎందుకంటే అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే వెళ్లి బ్రిజ్ భూషణ్ ను కలవడం, అందరూ బ్రిజ్ భూషణ్ గెల్చినట్లు దండలు వేయడంతో కథ మొదటికి వచ్చిందని రెజ్లర్లు భావించారు. ఈపరిణామంతో మరోసారి బ్రిజ్‌భూషణ్‌ గుప్పిట్లోకి డబ్ల్యూఎఫ్‌ఐ వెళ్లిందని ఈ అగ్రశ్రేణి రెజ్లర్లు ఆవేదన చెందుతున్నారు. కన్నీళ్లతో సాక్షి ఆటకు వీడ్కోలు పలికింది. పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తూ ప్రధానికి బజ్‌రంగ్‌ లేఖ రాశాడు.

అసలు... మహిళా రెజ్లర్లను వేధించారంటూ బ్రిజ్ భూషణ్ పై రెజ్లర్లు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. అంతే కాదు..బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని క్రీడామంత్రిత్వశాఖను కోరారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేశారు.ఆతర్వాత తమ పతకాలను గంగానదిలో కలిపేసేందుకు వెళ్దామని బయలుదేరితే.. చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది. దీంతో తమ ఆందోళనను నిలిపివేశారు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్‌ను తప్పించినప్పటికీ అతనిపై ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంతో ఏప్రిల్‌లో రెజ్లర్లు మళ్లీ రోడ్డెక్కారు. ఈ సారి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇప్పుడా కేసులు కోర్టులో విచారణలో ఉన్నాయి.

అంతేకాదు... బ్రిజ్ భూషణ్ నీడ.. డబ్య్లూఎఫ్ఐపై పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు...క్రీడామంత్రిత్వశాఖను కోరారు. అంతే కాదు.. బ్రిజ్‌భూషణ్‌ సన్నిహితులెవరూ ఎన్నికల్లో పోటీ పడకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఓ మహిళ అధ్యక్షురాలిగా ఉంటే అమ్మాయిలకు ఎలాంటి వేధింపులు ఉండవని అభిలాషించారు. కానీ అంతా తారుమారైంది.మరోవైపు దేశంలో చాలా కాలం పాటు నిలిచిపోయిన రెజ్లింగ్‌ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు డబ్ల్యూఎఫ్‌ఐ సన్నాహకాలు చేస్తోంది. మరి ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :