ASBL NSL Infratech

అమెరికా దిగ్గజ సంస్థ నుంచి ఫ్లిప్‌కార్ట్‌కు రూ.5,000 కోట్ల నిధులు

అమెరికా దిగ్గజ సంస్థ నుంచి ఫ్లిప్‌కార్ట్‌కు రూ.5,000 కోట్ల నిధులు

అమెరికాకు చెందిన దిగ్గజ రిటైల్‌ సంస్థ వాల్‌మార్ట్‌ నుంచి ఫ్లిప్‌కార్ట్‌కు సుమారు రూ.5,000 కోట్ల ( 60 కోట్ల డాలర్లు) నిధులు వచ్చినట్లు ఈ పరిణామాన్ని దగ్గర నుంచి గమనిస్తున్న వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని కంపెనీ కూడా ధ్రువీకరించింది. అయితే ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్‌ విలువకు 5-10 శాతం అధిక విలువ వద్ద ఈ పెట్టుబడిని వాల్‌మార్ట్‌ పెట్టిందని ఆ వర్గాలు తెలిపాయి. అయితే అధికారిక గణాంకాలను అని వెల్లడించలేదు. చివరిసారి ఫ్లిప్‌కార్ట్‌ 3.6 బిలియన్‌ డాలర్లను (రూ.26,800 కోట్లు) సమీకరించినప్పుడు కంపెనీ విలువను 37.6 బిలియన్‌ డాలర్లు (రూ.2.79 లక్షల కోట్లు)గా ప్రకటించారు. ఆ సమయంలో ఈ నిధులను జీఐసీ, కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్‌, సాఫ్ట్‌ బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ 2, వాల్‌మార్ట్‌, డిసప్ట్‌ ఏడీ, ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ, టైగర్‌ గ్లోబల్‌ నుంచి సమీకరించారు. తాజాగా మాత్రం ఫ్లిప్‌కార్ట్‌ విలువను 40 బిలియన్‌ డాలర్ల లోపే లెక్కగట్టినట్లు తెలుస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :