ASBL NSL Infratech

ఉక్రెయిన్ కు ఈయూ భారీ సాయం

ఉక్రెయిన్ కు ఈయూ భారీ సాయం

రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు యూరోపియన్‌ యూనియన్‌ సిద్ధంగా ఉంటుందని యూరోపియన్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ చార్లెస్‌ మైకేల్‌ తెలిపారు. బ్రస్సెల్స్‌లో సమావేశమైన ఈయూలోని 27 సభ్య దేశాల నేతలు ఉక్రెయిన్‌కు 54 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4.48 లక్షల కోట్లు) సాయం ప్యాకేజీని అందించేందుకు అంగీకరించినట్లు వెల్లడిరచారు. ఇందుకు సంబంధించిన తీర్మానంపై కేవలం గంటలోపే చర్చించి ఆమోదించినట్లు వివరించారు. సాయానికి సంబంధించిన తీర్మానాన్ని వీటో చేస్తామంటూ సభ్య దేశం హంగెరీ ప్రధాని విక్టర్‌ ఓర్బాన్‌ కొంతకాలం చేస్తున్న హెచ్చరికలను కూడా పటిÊ్టంచుకోలేదన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :