ASBL NSL Infratech

అధికారులపై ఈసీ వేటు.. జగన్‌కు తలనొప్పా..?

అధికారులపై ఈసీ వేటు.. జగన్‌కు తలనొప్పా..?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ పై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలు రెఫరెండం లాంటివి. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశానని ఆయన చెప్తున్నారు. ఐదేళ్లలో రెండున్నర లక్షల కోట్లకు పైగా నగదును నేరుగా లబ్దిదారుల అకౌంట్లలో జమ చేశానని జగన్ పదేపదే ప్రస్తావిస్తున్నారు. అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్నారని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. జగన్ అండ్ కోపై ఈసీకి ఫిర్యాదులు చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్షాల వ్యవహారం ఎన్నికల సంఘానికి పెద్ద సమస్యగా మారింది. అధికార పార్టీపై టీడీపీ, జనసేన, బీజేపీ ప్రతిరోజూ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. సీఎం జగన్ సహా అభ్యర్థులు, సలహాదారుల వరకూ అందరూ కోడ్ ఉల్లంఘిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అదే సమయంలో వైసీపీ కూడా విపక్షాలపై ఇదే తరహా ఫిర్యాదులను ఈసీకి అందిస్తోంది. వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటోంది ఈసీ. ఆ క్రమంలో ఇప్పటికే పలువురు అధికారులపై వేటు పడింది. గతంలో మూడు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లపై వేటు వేసిన ఈసీ.. తాజాగా ఇద్దరు సీనియర్ ఐపీఎస్ లపై వేటు వేసింది.

ఇప్పటివరకూ ఏపీలో వేటు పడిన అధికారులంతా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. సీఎం క్యాంప్ ఆఫీస్ చెప్పినట్లు ఆ అధికారులు నడుచుకుంటున్నారని.. అధికార పార్టీకి లబ్ది చేకూర్చేందుకు వాళ్లు కోడ్ ఉల్లంఘిస్తున్నారని విపక్షాలు చేసిన కంప్లెయింట్లపై విచారణ జరిపి ఈసీ వేటు వేసింది. త్వరలో మరికొంతమంది ఉన్నతాధికారులపై వేటు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇలా కీలక అధికారులపై వేటు పడడం, వాళ్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడం వైసీపీకి ఇబ్బందికరంగా మారుతోంది. గతంలో ఎన్నికల సందర్భంగా వైసీపీ అధికారులను అడ్డు పెట్టుకుని లబ్ది పొందిందనేది విపక్షాల మాట.

జగన్ పై వ్యతిరేకత ప్రజల్లో తీవ్రంగా ఉందని.. అయితే అధికారం ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఏదైనా చేసి మళ్లీ గెలుస్తారని విపక్షాలు భావించాయి. దానికి చెక్ పెట్టాలంటే కేంద్రంలోని బీజేపీతో స్నేహం చేయడం ఒక్కటే మార్గం. బీజేపీని కూటమిలో చేర్చుకోవడం ద్వారా ఈసీని తమ గుప్పిట్లోకి తెచ్చుకుందనే టాక్ ఏపీలో వినిపిస్తోంది. అందుకే జగన్ కు అండగా ఉంటున్న వారందరిపైనా ఈసీ వేటు వేస్తోందని చెప్పుకుంటున్నారు. ఎన్నికల నాటికి మరికొంతమంది కీలక అధికారులపై కూడా వేటు పడే ఛాన్స్ ఉందనే సంకేతాలు వస్తుండడంతో వైసీపీ శిబిరంలో టెన్షన్ నెలకొంది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :