ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కెనడా లో అంబరాన్ని అంటిన డుర్హం తెలుగు క్లబ్ ఉగాది వేడుకలు (DTC)

కెనడా లో అంబరాన్ని అంటిన డుర్హం తెలుగు క్లబ్ ఉగాది వేడుకలు (DTC)

కెనడా ఒంటారియో రాష్ట్రములోని ఆశావా నగరంలో శోభాకృత నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యద్భుతంగా నిర్వహించారు. డుర్హం తెలుగు క్లబ్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిధిగా కెనడా లీడర్ పియర్ పోలీవ మరియు ఆశావా, వాన్ నగర ఎంపీలు హాజరు అయ్యారు.

డుర్హం రీజియన్ లో నివసిస్తున్న తెలుగు వారు అందరు వారి కుటుంబ సభ్యులతో వేడుకలో పాలు పంచుకున్నారు. పంచాంగ శ్రవణం  తో ప్రారంభమైన వేడుకలు పిల్ల పాపల కేరింతల తో, ఆట పాటలతో ప్రాంగణం హోరెత్తి పోయింది.ముఖ్య అతిధి పియర్ పోలీవ మాట్లాడుతూ  ఎంతో మంది భారతీయులు మరియు ఇతర దేశస్థులు కెనడా లో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు ధరల నియంత్రణ, శాంతి భద్రతలు, నాణ్యమైన జీవన ప్రణామాలు మరియు స్వేచ్ఛ సమాజం తన అభిమతం అని వాటి సాధన కోసం తాను శ్రమిస్తాను అని తెలియ చేసారు.

డీటీసీ అధ్యక్షుడు గుత్తిరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఉగాది ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో ప్రసిద్ధి పండుగ . మేము ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో  చైత్రమాసంలో కొత్త సంవత్సరం ప్రారంభానికి గుర్తుగా జరుపుకుంటాము  అని తెలియ చేసారు.

టొరంటో నగరం లో వివిధ రంగాలలో రాణిస్తున్న తెలుగు వారికి ఉగాది పురస్కారాలతో డీటీసీ అధ్యక్షుడు గుత్తిరెడ్డి నరసింహారెడ్డి, కమిటీ కార్యవర్గ సభ్యుల సత్కరించారు.అతిధులకు ష్రడ్రుచులతో తెలుగు ఇంటి రుచులతో ఆహరం ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమం లో డుర్హం తెలుగు క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సర్ధార్ ఖాన్, రవి మేకల, వెంకట్ చిలువేరు, రమేష్ ఉప్పలపాటి, శ్రీకాంత్ సింగిసేథీ, గుణ శేఖర్ కూనపల్లి, గౌతమ్ పిడపర్తి, కమల మూర్తి, వాసు మరియు యుజి చెరుకూరు పాల్గొన్నారు.  

ఏ దేశమేగినా ఎందు కాలెడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము అన్నసూక్తులతో సభ ఘనంగా ముగిసినది.

 

Click here for Event Gallery

 

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :