ASBL NSL Infratech

డాక్టర్ రెడ్డీస్ అరుదైన ఘనత

డాక్టర్ రెడ్డీస్ అరుదైన ఘనత

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ 2023 సంవత్సరానికి స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ డౌజోన్స్‌ సస్టెయినబులిటీ వరల్డ్‌ ఇండెక్స్‌ (డిజేఎస్‌ఐ వరల్డ్‌)లో స్థానం సంపాదించుకుంది. ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి భారతీయ ఫార్మా కంపెనీ ఇదే. ఇదే కాకుండా డాక్టర్‌ రెడ్డీస్‌కు గ్లోబల్‌ సస్టెయినబులిటీ రేటింగ్స్‌ ఏజెన్సీ అయిన ఎకోవాడిస్‌ నుంచి బంగారు పతకం హోదా లభించింది. నాలుగు విభాగాల్లో 21 అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ రేటింగ్‌ను నిర్ణయిస్తారు. దీంతో పాటు డాక్టర్‌ రెడ్డీస్‌ ఇటీవల వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) చేపట్టిన 1టీ. ఓఆర్‌జీ బృందంలో చేరింది. దాదాపు రెండు దశాబ్దాలుగా తాము స్థిరమైన ప్రగతి సాధిస్తూ ముందుకు సాగుతున్నామని, అంతర్జాతీయ సంస్థల నుంచి గుర్తింపు లభించడం దీనికి నిదర్శనమని డాక్టర్‌ రెడ్డీస్‌ ఎండీ జీవీ ప్రసాద్‌ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా ప్రభుత్వం, తమ ఉద్యోగులు, రోగుల ప్రయోజనాలను కాపాడాలనే ఆలోచన తమకు ఉందని వివరించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :