MKOne Telugu Times Business Excellence Awards

ఉద్యోగులకు డిస్నీ మరో షాక్.. 7 వేల మందికి ఉద్వాసన!

ఉద్యోగులకు డిస్నీ మరో షాక్.. 7 వేల మందికి ఉద్వాసన!

ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజం డిస్నీ మరోసారి ఉద్యోగులకు చేదువార్త చెప్పింది. మూడో రౌండ్‌ తొలగింపులను షురూ చేసింది. ఈ నిర్ణయం అంతటా 2,500 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని  తెలుస్తోంది. ఖర్చులను తగ్గించే చర్యలో భాగంగా, కంపెనీ ఈ వారం తన స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ల నుండి డజన్ల కొద్దీ టైటిల్స్‌ను తొలగిస్తోంది.  నివేదిక ప్రకారం తీవ్రంగా దెబ్బతిన్న టెలివిజన్‌ విభాగం, రెండో రౌండ్‌ ఉద్యోగాల కోతకు నిర్ణయించింది. ఉద్యోగుల తొలగింపులు, ఇతర వ్యయ ` తగ్గింపు చర్యల ద్వారా 5.5 బిలియన్‌ డాలర్లను ఆదా చేయాలనే ప్రణాళికలను ఫిబ్రవరిలో ప్రకటించింది.  కాగా డిస్నీ సీఈవో బాబ్‌ ఇగెర్‌ మూడు రౌండ్ల తొలగింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే.  మొదటి రౌండ్‌ లేఆఫ్స్‌ మార్చిలోనే షురూ అయ్యాయి. రెండో రౌండ్‌లో ఏప్రిల్‌లో 4 వేల మంది ఉద్యోగులను తొలగించింది. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 7,000 మంది కార్మికులకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబరు 1 నాటికి డిస్నీకి 2,20,000 మంది ఉద్యోగులు  ఉన్నారు.

 

 

Tags :