ASBL NSL Infratech

నితిన్ తో అడ్జ‌స్ట్ అయిపోనున్న సూరి

నితిన్ తో అడ్జ‌స్ట్ అయిపోనున్న సూరి

ఒక్క శుక్ర‌వారం ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో తారల స్టేట‌స్ ని తేల్చేస్తుంది. అప్ప‌టివ‌ర‌కు ఖాళీ వారు ఒక్క సినిమాతో బిజీ అవొచ్చు. క్ష‌ణం తీరిక లేకుండా బిజీగా ఉండే వారు అదే ఒక్క సినిమాతో ఖాళీ అవొచ్చు. స‌క్సెస్ రేట్ బాగా త‌క్కువుగా ఉండే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్ కు చాలా ఎక్కువ విలువ ఉంటుంది. ఏజెంట్ సినిమా రిలీజ్ కు ముందు మంచి క్రేజ్ ఉన్న సురేంద‌ర్ రెడ్డి, సినిమా రిలీజ్ త‌ర్వాత చాలా ఇబ్బందిక‌ర పరిస్థితుల్లో ఉన్నాడు. 

సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో నింద మొత్తం ఆయ‌నే తీసుకోవాల్సి వ‌చ్చింది. స్వ‌యంగా నిర్మాతే ఫుల్ స్క్రిప్ట్ లేకుండా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాం అందుకే సినిమాకు ఇలాంటి ఫ‌లితమొచ్చింద‌ని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో సురేంద‌ర్ రెడ్డిదే త‌ప్పు అని తేలిపోయింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు సురేంద‌ర్ రెడ్డి తో మూవీ చేయ‌డానికి బ‌న్నీ ఇంట్రెస్ట్ చూపించాడు.

కానీ ఏజెంట్ రిజ‌ల్ట్ చూశాక బ‌న్నీ మన‌సు మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. ఏజెంట్ రిలీజ్ త‌ర్వాత కూడా సూరి బ‌న్నీ తో చేసే సినిమా కోసం క‌థ మీద కొంత వ‌ర్క్ చేశాడు. కానీ బ‌న్నీ మ‌న‌సు మార్చుకోవ‌డంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. మూవీల విష‌యంలో బ‌న్నీ ఎంతో కేర్ తీసుకుంటాడు. గ‌తంలో విక్ర‌మ్ కుమార్, లింగుస్వామి లాంటి వారితో కూడా కొన్ని రోజులు ట్రావెల్ చేసి, త‌ర్వాత లైట్ తీసుకున్నాడు. ఇప్పుడు సూరీ పొజిష‌న్ కూడా అదే. 

ఇక బ‌న్నీతో సూరి సినిమా దాదాపు క్యాన్సిల్ అనే స‌మాచారం. దీంతో సూరి వేరే దారి చూసుకుంటున్న‌ట్లు స‌మాచారం. నితిన్ తో సూరి ఓ మూవీ చేయాల‌ని చూస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం నితిన్, సూరి ద‌గ్గ‌ర ర‌చ‌యిత‌గా ప‌నిచేసే వక్కంతం వంశీతో సినిమా చేస్తున్నాడు. దీని త‌ర్వాత నితిన్, సూరి ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కే ఛాన్సున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా దాదాపు ఖాయ‌మైన‌ట్లే సమాచారం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :