బెంగాల్ గవర్నర్ గా ఆనంద బోస్‌ ప్రమాణస్వీకారం

బెంగాల్ గవర్నర్ గా ఆనంద బోస్‌ ప్రమాణస్వీకారం

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా సీవీ ఆనంద బోస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. సీవీ ఆనంద బోస్‌ చేత కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాశ్‌ శ్రీవాస్తవ ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్‌లో వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, మంత్రులు, స్పీకర్‌ బిమాన్‌ బెనర్జీతో పాటు పలువురు పాల్గొన్నారు.  సీవీ ఆనంద బోస్‌ 1977 బ్యాచ్‌కు చెందిన కేరళ ఐఏఎస్‌ ఆఫీసర్‌. అయితే ఆనంద పదవీ విరమణ కంటే ముందు కోల్‌కతాలోని జాతీయ మ్యూజియంలో అడ్మినిస్ట్రేటర్‌గా సేవలందించారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత సువేందు అధికారి హాజరు కాలేదు.

 

Tags :